సింగర్ చిన్మయి శ్రీపాదకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్గా రాణిస్తుంది. ఇక.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మహిళలు ,చిన్నపిల్లలపై జరిగే వేధింపులు, దాడులపై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్లపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో మీటు ఉద్యమం టైంలోనూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లకు అవకాశాలు ఇవ్వడం పై రియాక్ట్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. తన ట్విట్టర్ వేదికగా చిన్మయి మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే ఇలాంటి మగవాళ్ళ చేతుల్లో.. అవకాశాలు పెట్టడం అంటే లైంగిక వేధింపులకు సపోర్ట్ ఇవ్వడమే అంటూ మండిపడింది.

మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమే అయితే.. అది తప్పకుండా ఎవరిని వదిలిపెట్టదని చిన్మయి ట్విట్టర్ వేదికగా పోస్ట్ ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెటింట వైరల్గా మారడంతో.. పలువురు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుంటే.. మరి కొంతమంది మాత్రం.. ఇంకా జానీ మాస్టర్, కార్తీక్ లు తప్పు చేసినట్లు పూర్తిగా రుజువు కాలేదని.. ఎలాంటి ఆధారాలు లేవని.. తప్పుడు అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వాళ్ళ పరువు తీయొద్దంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

