టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాలతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని పాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగేలా.. తనని తాను మలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో తన 22వ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కోసం 100% ఎఫర్ట్స్ పెడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నాడు బన్నీ. తన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదలకుండా కష్టపడుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా ఇండియన్ హిస్టరీ లోనే నెవర్ బిఫోర్ రేంజ్లో రూపొందుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తుండగా.. హాలీవుడ్ ప్రమాణాలతో ఆర్ఆర్ఆర్ను ప్లాన్ చేస్తున్నారు. ఇక.. బన్నీ డ్యాన్సింగ్ ఎబిలిటీ.. బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ట్యూన్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా కోసం ఏకంగా రెండేళ్లు పైగా సమయాన్ని కేటాయించనున్నాడట బన్నీ. అయితే సినిమాలు మాత్రం ఆడియన్స్ ఊహలను మించిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని.. షూట్ ను సర్వే గంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా సెట్స్ కి వెళ్లాలని బన్నీ కూడా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బన్నీ స్వయంగా తానే షూట్ కోసం టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని.. దర్శక నిర్మాతలకు సహకరిస్తున్నాడట. చాలా.. సైలెంట్ గా తన పార్ట్‌ని బన్నీ కంప్లీట్ చేస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. తన షూట్ పార్ట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పనుల్లో అడుగుపెడతాడు. ఇప్పటికే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు.

అయితే.. త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ తో బన్నీ ని ఒప్పించగలడా.. లేదా.. తెలియాల్సి ఉంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన త్రివిక్రమ్‌తో సినిమా కోసం బన్నీ సైతం ఆసక్తి చూపుతున్నాడు. అయితే.. త్రివిక్రమ్‌తో పాటు.. ఎంతోమంది ఆల్ ఇండియా దర్శకులు సైతం అల్లు అర్జున్ కోసం పోటీ పడుతూ.. స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న పరిస్థితి. వీటిలో ప్రశాంత్ నీల్, రాజమౌళి, కొరటాల, సంజయ్ లీలా భన్సాలి లాంటి స్టార్ దర్శకుల పేర్లు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక బన్నీ వీలైనంత త్వరగా చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసి రానున్న ప్రాజెక్టులలో పాత్రలో వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అట్లితో సైన్స్ ఫిక్షన్ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత.. బన్నీ డెసిషన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

