పెద్ది చిక్కిరి పై ఆర్జీవి అసలు ఊహించని కామెంట్స్..!

రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్‌లో పెద్ది సినిమా రూపొందుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికే.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సీక్రెట్ చిక్కిరి సోషల్ మీడియాను షేక్‌ చేస్తూ.. అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్.. అభిమానులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే.. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సాంగ్ పై రియాక్ట్ అయ్యాడు.

స్టార్ హీరోలను ఎలా చూపించాలో అలా చూపించారని చెప్పుకొచ్చాడు. చిక్కిరి చిక్కిరి సాంగ్.. అందులో చరణ్ వేసిన హుక్ స్టెప్స్‌.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో ఎలాంటి అనవసర ఎఫెక్ట్స్, ఆర్బాటలు లేకుండా ఫోకస్ మొత్తం హీరో పైనే ఉంచి.. ఆయననే ఎలివేట్ చేస్తూ డైరెక్టర్ అద్భుతంగా రూపొందించాడని.. రాంగోపాల్ వర్మ వివరించాడు. కొద్ది గంటల క్రితం తన ఎక్స్ వేదికగా ఆర్జీవి రివ్యూ షేర్‌ చేసుకున్నాడు.

Ram Gopal Varma Applauds Ram Charan's 'Chikiri Chikiri' for Showcasing Raw Energy and Vision in Upcoming Film 'Peddi' | - The Times of India

డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ.. ఇలా సినిమాలోని ఏ క్రాఫ్ట్ అయినా వాటి నిజమైన ఉద్దేశం హీరోని ఎలివేట్ చేయడమే అయ్యుండాలి.. చాలా రోజుల తర్వాత చరణ్ చాలా రా, రియల్, ఎక్స్‌క్లోజ్ రూపంలో.. చిక్కిరి చిక్కిరి సాంగ్ లో క‌నిపించాడు. అనవసరమైన మెరుపులు.. అర్థం లేని భారీ సెట్స్ కాకుండా.. ఊహ‌ కందని ప్రొడక్షన్ డిజైన్స్ ఏమి లేకుండా.. వందల మంది డ్యాన్సర్లు లేకపోయినా సింగిల్ స్టార్ ల మెరిశాడని.. అలా డిజైన్ చేసినందుకు బుచ్చిబాబు సన్నకు అభినందనలు.. స్టార్ పైన ఫోకస్ పెట్టాలని విషయాన్ని పాటించావు అంటూ.. ఆర్జీవి ట్విట్ చేశాడు. ప్రస్తుతం తాను చేసిన ట్విట్ నెటింట వైరల్ గా మారుతుంది.