టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్.. నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా మెరవనున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను.. ఇప్పటికే కొంతమంది వీక్షించారు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయాలు ఏంటి.. వాళ్ళ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూస్తేనే ఇది ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్.. లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్యన లవ్, బ్రేకప్, ఫ్యామిలీ బాండీ లాంటివన్నీ జోడించి కథని రూపొందించినట్లు క్లారిటీ వచ్చేస్తుంది.

ముఖ్యంగా ఇంత క్యారెక్టర్ లెస్ కూతురు అంటూ వచ్చే డైలాగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఎలాంటి కథతో సినిమా తీసి ఉంటాడు అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. బంధాలపై రాహుల్ డైరెక్ట్ చేసిన బ్రిలియంట్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ అని.. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో.. రష్మిక భూమా పాత్రలో నటించగా.. ఇక దీక్షిత్ శెట్టి విక్రమ్ రోల్ లో మెరిసాడు. వీళ్ళిద్దరి నటన అద్భుతంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇక.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాహుల్ రవీంద్రన్ సైన్స్‌బుల్ రైటింగ్ అని సమాచారం. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కచ్చితంగా ఆకట్టుకుంటాయని.. రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న క్రమంలో ప్రతి ఒక్క ఆడియన్‌కు ది గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చూపించాడని దీనికి ఆయనను ప్రశంసించాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో.. ఫస్ట్ షోతో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.


