రాజమౌళి ఎక్కడా హనుమంతుడిని అవమానించలేదు.. హైపర్ ఆది..

వార‌ణాసి ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దుమారం రేపుతున్నాయ్యో.. ఎంత పెద్ద సెన్సేషన్‌కు దారితీసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి వారణాసి వీడియో లేట్ కావడంతో.. దేవుని తప్పుపడుతూ మాట్లాడడని.. తీవ్ర‌ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. దానిపై ఇప్పటివరకు రాజమౌళి గాని.. వారణాసి టీం కానీ రియాక్ట్ కాలేదు. అయితే.. కొద్ది గంటల క్రితం స్టార్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు.

ఆయన ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశాడు. ఇందులో భాగంగా.. ఆది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దర్శకులు, హీరోలు, నిర్మాతలపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారని.. చాలా దారుణంగా నచ్చినట్లు సోషల్ మీడియాను వాడేస్తున్నారని.. వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు దేవుని అవమానించలేదు.. తన గ్లింప్స్‌ వీడియో లేట్ అయినందుకు హనుమంతుడి పై అలిగాడు అంతేతప్ప.. ఎక్క‌డా అవమానించలేదు అంటూ వివరించాడు.

Actor Hyper Aadi Speech at Premante Love Trotter Event | Priyadarshi,  Anandi, Suma | Rana Daggubati

సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా సెలబ్రిటీలను ట్రోల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. అలాంటి వాళ్ళు అంతకంతకు ఎక్కువైపోతున్నారని ఫైర్ అయ్యాడు. ఇందులో భాగంగానే.. రాజమౌళి వేసిన ఏ పోస్టర్ని వదలకుండా ట్రోల్స్ చేసేస్తున్నారని.. అల్లు అర్జున్ నవ్వినా, చిరంజీవి మాట్లాడిన, చరణ్ పైన కూడా నచ్చినట్లు.. ఇష్టం వచ్చినట్లు.. ఏది చేసిన ట్రోలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇలాంటివి త‌గ్గించుకోవాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం హైపర్ ఆది కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.