టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి ఏప్రిల్ నెల రిలీజ్ అయిన టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. పెద్ది షాట్స్ ఐపీఎల్ టైంలో తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇక.. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి సాంగ్.. సోషల్ మీడియాలో ప్రత్యేకమైన వైబ్ సృష్టించింది.
కేవలం టాలీవుడ్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో.. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా చాలామంది సాంగ్ లోని హుక్ స్టెప్ ఫీల్ అవుతూ ఇన్‌స్టాలో తెగ రిల్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో చరణ్ ఒక కాలు తీసేస్తారట. వైకల్యంతోనే ఒలంపిక్ గేమ్స్ లో పాల్గొని ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడంటూ టాక్ ఇండస్ట్రీ వర్గాలనుంచి తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం చరణ్ ఫ్యాన్స్ ఈ క్లైమాక్స్ ను యాక్సెప్ట్ చేస్తారా.. అసలు అలాంటి ఓ రోల్లో చరణ్ ఊహించుకోగలరా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

అయితే.. ఇటీవల కాలంలో ఆడియన్స్ కొత్త ఆలోచనలను, కంటెంట్ల వైవిధ్యతను ఆస్వాదిస్తున్నారు. కంటెంట్ ఆకట్టుకుంటే ఎలాంటివన్నీ పెద్దగా సమస్య కావంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా వచ్చే ఏడాది యార్చ్లో చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని మొదలుపెట్టేశారు. సినిమా అనుకున్న టైం కు కంప్లీట్ చేసి.. రిలీజ్ చేసేలా పక్క ప్లాన్‌తో టీం మొత్తం కొనసాగుతున్నారు. ఇక.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


