టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఏకైక మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ గతంలో దీంతో పాటు.. హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను మధ్యలో ఆపేశారు. కొంతకాలం బ్రేక్ తర్వాత మళ్లీ డిప్యూటీ సీఎం గా మారి.. ఫ్రీ స్పేస్ దొరికిన తర్వాత ఈ మూవీస్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. మెల్లమెల్లగా మూడు సినిమాలను కంప్లీట్ చేశాడు. ఈ మూడిట్లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్‌కాగా.. వీరమల్లు కమర్షియల్ గా డిజాస్టర్ గా నిలిచిన అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఓజీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఆయన నుంచి మిగిలి ఉన్న ఏకైక మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా పవన్ రోల్‌కు సంబంధించిన షూట్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయింది. కేవలం ఆయన లేని సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకి ఆ పార్ట్ కూడా సినిమా పూర్తి అయిపోతుందట. వచ్చే నెల నుంచి రెగ్యులర్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. సినిమా నిర్మాత రవిశంకర్ ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్ మూడవ వారంలో.. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుందని చెప్పుకొచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఎందుకంటే.. ప్రస్తుతం మైత్రి మేకర్స్ చేతిలో.. రామ్ చరణ్ పెద్తి సినిమా సైతం ఉంది. ఈ సినిమా మార్చ్ 27న రిలీజ్ కానుంది. చరణ్ నుంచి ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి నెలలోనే అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ సినిమాను రిలీజ్ చేయడం కాస్త రిస్కే అయిన.. మైత్రి మేకర్స్‌కు ఇలాంటి రెస్క్ లు కొత్తవి కాదు.
![]()
2023లో ఇదే బ్యానర్ పై వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలను రూపొందించి రెండు సినిమాలను ఒక్కరోజు గ్యాప్ తోనే రిలీజ్ చేసి కమర్షియల్ గా రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అలాంటి రికార్డ్ మొదటిసారి. ఈసారి కూడా మళ్లీ అదే రేంజ్ లో సక్సెస్ లో అందుకోవడం ఖాయమని రెండు సినిమాలు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటే మైత్రి బ్యానర్ పై ఎన్టీఆర్ నీలి సినిమాతో పాటు.. ఆంధ్ర కింగ్ తాలూకా, ఫౌజీ సినిమాలు సైతం రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. ఈ ఐదు సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంటాయని.. మేము చెప్పింది అబద్ధమైతే ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తామంటూ స్ట్రాంగ్ ఛాలెంజ్ విసిరాడు. మరి ఈ ఛాలెంజ్ లో రవిశంకర్ సక్సెస్ అందుకుంటాడా.. లేదా.. వేచి చూడాలి.

