అఫీషియల్.. అఖండ 2 ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెర‌కెక్క‌నున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు.. గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాలయ్య మాస్‌తో గూఐస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ అప్డేట్స్ రావడంతో.. ఆడియన్స్‌లో సినిమా ట్రైలర్ పై ఆసక్తి మొద‌లైంది.

Akhanda 2 Trailer Launch Event in Karnataka with Nandamuri Balakrishna

ఎప్పుడెప్పుడు ట్రైలర్ అప్డేట్ వస్తుందా అంటూ అంతా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ ట్రైలర్ అప్డేట్స్‌ మేకర్స్ రివీల్‌ చేశారు. నవంబర్ 21 సాయంత్రం 6 గంటలకు.. ట్రైల‌ర్ లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంట్ ను మేకర్స్ చెప్పినట్లుగానే కర్ణాటక చింతామణి ప్రాంతంలో నిర్వహించనున్నారు. అక్కడ భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ సందడి చేసే అవకాశం ఉన్న క్రమంలో.. యూనిట్ సభ్యులు ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ చేశారని.. సేఫ్టీ కోసం ముందే అంత ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

అదే టైంలో.. ఈవెంట్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ హీరో స్పెషల్ గెస్ట్ గా రానున్నాడట. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఎస్.. మీరు విన్నది కరెక్టే. బాలయ్య, శివరాజ్ కుమార్ ఒకే వేదికపై మెరవనున్నారని.. టాక్‌ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇద్దరు లెజెంటరీ స్టార్ హీరోస్ ఓకే స్టేజిపై కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్‌లో డబల్ సెలబ్రేషన్స్ మొదలైపోతాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఈవెంట్‌పై అభిమానుల‌లో ఆసక్తి డబల్ అయింది.