టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సినిమాలో తారక్ ఓ పవర్ ఫుల్ రోల్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ తో కనిపించనున్నాడట. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం సరవేగంగా జరుగుతుంది. ఓ కీలకమైన స్కెడ్యూల్ కోసం మూవీ టీం ఈనెల రెండవ వారంలో యూరప్ కు కూడా వెళ్ళనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక.. ఆ రూమర్లపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చారు. స్క్రిప్ట్ విషయంలో తేడాలు రావడంతో.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌పై ఫైర్ అయ్యారని.. ఈ క్రమంలోనే డ్రాగన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు గతంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా మరోసారి సినిమా నడివి ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా సినిమాను తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ వార్తలు ట్రెండింగ్‌గా మారాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజిఎఫ్ రెండో భాగం కూడా రిలీజై సంచలనం సృష్టించింది.
సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగా పర్వం ఫ్యూచర్లో తెరకేక్కనుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ కూడా రెండు భాగాలుగా వస్తుందని రూమర్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలను ప్రశాంత్ టీం ఖండిస్తూ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాపై వస్తున్న ఊహగానాల అసలు నమ్మద్దని.. కేవలం ఒకే భాగంగా రానున్న ఒక శక్తివంతమైన కథ ఇది అంటూ వివరించారు. దీంతో.. రూమర్స్‌కు చెక్ పడింది. ఇక.. ఈ సినిమాపై చిన్న అప్డేట్ అయినా వస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ ఆ కోరికను ఎప్పుడు నెరవేరుస్తాడో.. సినిమాపై ఏ రేంజ్ లో అప్డేట్స్ ఇస్తాడు చూడాలి.



