డ్రాగన్ కోసం నీల్ మాస్టర్ ప్లాన్.. గ్లోబల్ ఈవెంట్ కు అంతా సిద్ధం..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా.. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో.. మూవీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుదుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాకు ఇంకా డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేయలేదని.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని.. అఫీషియల్‌గా ఏ టైటిల్ ఫైనల్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్‌లో రూపొందిస్తున్న క్రమంలో.. ప్రశాంత్ విజన్‌కు తగ్గట్లుగా ఎన్టీఆర్ కొత్త అవతారం చూపించనున్నాడని వివరించాడు.

సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వారణాసి రేంజ్ లో.. ప్రాజెక్టుకి తగ్గట్లుగా గ్రాండ్గా రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు. ఫిలిం ప్రమోషన్స్‌ను భారీ ఈవెంట్ మోడల్‌లో చేస్తే.. సినిమా థీమ్ ఆడియన్స్‌ అందరికి క్లియర్ కట్గా అర్థమయ్యేలా చెప్పే అవకాశం ఉంటుందని టీం భావిస్తున్నారట. ఈ క్రమంలోనే.. గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్ కు చేరుకునేలా ప్రమోషన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ తో పాటు.. ఇత‌ర విదేశీ మీడియాల‌కు కూడా ప్రచారం చేసేలా ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి తెలియచెప్పేలా.. సినిమాపై భార్య అంచనాలను నెలకొల్పడానికి నీల్‌ గ్లోబ‌ల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Jr NTR-Prashanth Neel movie gets an official production update

ఇక తక్కువ టైంలో కంటెంట్ పై బజ్‌ క్రియేట్ చేయడం, సినిమా స్టోరీ పై ఎలాంటి తప్పుదారులు వెళ్లకుండా క్లారిటీ ఇవ్వ‌డానికైనా.. ఓ కొత్త ట్రెండ్ సృష్టించినట్లు అవుతుందని.. మూవీ యూనిట్ భావిస్తున్నార‌ట‌. జక్కన్న.. వారణాసి ఈవెంట్ తర్వాత ఇండియన్ సినీ ఇండస్ట్రీలో.. టైటిల్ ఈవెంట్ కూడా ఓ కొత్త ప్రమోషనల్ ట్రెండ్‌గా మారిపోయింది. మరి ఇదే బాటలో తారక్, నీల్ ప్రాజెక్ట్‌ కూడా అడుగులు వేస్తుందని.. రవిశంకర్ మాటలతో క్లారిటీ వచ్చేసింది.