టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దసరా లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో ది పారడైజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు నాని. ఇక.. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ కథతో ఆడియన్స్ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే గతంలో సినిమాలో నాని పేరును రివీల్ చేస్తూ ఓ క్రేజీ పోస్టర్ షేర్ చేయగా ఈ పోస్టర్ లుక్ తో పాటు నాని పేరు సైతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక ఈ మూవీలో జడల్ పాత్రలో నాని కనిపించనున్నాడు.

ఇది ఓ కథగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసిందంటూ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే.. సినిమాపై మంచి బజ్ మొదలైంది. మార్చి 26న ఈ సినిమా ఆడియన్స్ను పలకరించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు.. దాదాపు 8 భాషల్లో ఈ సినిమా ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా కాదు.. గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న సినిమా కావడంతో.. పాన్ వరల్డ్ రేంజ్ లో ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా ప్రమోషనల్ స్ట్రాటజీని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. లోకల్ మీడియా కాదు.. ఇంటర్నేషనల్ మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లను కూడా పిలిచి మరీ.. ప్రమోషన్స్ చేయబోతున్నారని.. పలువురు హాలీవుడ్ స్టార్స్ ను కూడా అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో.. ది ప్యారడైస్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని.. కచ్చితంగా నాని ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తిరుగుబాటు, నాయకత్వంతో పాటు.. తల్లి కొడుకుల మధ్యన అందమైన ఓ బాండింగ్ చూపిస్తూ తెరకెక్కించనున్నట్లు రివీల్ అయ్యిన ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ వస్తుంది.

