” వృషకర్మ ” గా నాగచైతన్య.. టైటిల్ మీనింగ్ తెలిస్తే షాకే..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య చివరిగా తండేల్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్లు, ప్లాపులతో సతమతమవుతున్న చైతుకి ఈ మూవీ మంచి క‌మ్‌ బ్యాక్ ఇచ్చింది. కెరీర్‌లో మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రస్స్ సినిమాగాను రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ కావాలని చైతన్యకు కాదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి కీలకంగా మారింది. కారణం నాగార్జున, అఖిల్ కూడా వరుస డిజాస్టర్లను చూశారు. ఇక అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలైనా.. ఒక్క సరైనా సక్సెస్ కూడా అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ కు నాగ‌ చైతన్య సక్సెస్ ఊపిరి పోసింది అని చెప్పాలి.

Makers of Naga Chaitanya starrer NC24 unveil special BTS video

ఇక ఈ సినిమా తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో ఓ మిస్టేక్ థ్రిల్లర్ జాన‌ర్‌ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక‌ సరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు టీం. తాజాగా.. సినిమాకు వృషకర్మ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. చైతన్య బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు.. టైటిల్ కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఈ టైటిల్ అనౌన్స్మెంట్.. సూపర్ స్టార్ మహేష్ ద్వారా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయించడం విశేషం. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత చాలామందిలో ఇదేమి టైటిల్ అసలు.. దీని అర్థం ఏంటి అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ దాని మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం.

karthik varma dandu (@karthikdandu86) / Posts / X

వృషక‌ర్మ అంటే.. మంచి పని కోసం ఎలాంటి సమస్యలు ఎదురైనా లెక్కచేయకుండా పట్టుదలతో ముందుకు వెళ్లే వ్యక్తి.. స్ట్రాంగ్ పర్సన్ అని అర్థం. అంతేకాదు.. శ్రీమహావిష్ణువుకి హిందువులు పెట్టుకున్న వెయ్యి పేర్లలో వృషకర్మ సైతం ఒకటి. ధర్మబద్ధమైన పనులను వృషకర్మగా పోలుస్తారు. ఈ క్రమంలోనే సినిమా స్టోరీ కూడా శ్రీమహావిష్ణువుకి సంబంధించిన ఏదో రహస్యాన్ని చేదించే క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలు.. ఆయన చేసే సాహసాలు కథాంశంతో రూపొంది ఉంటుందని సినీ స్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీ జోన‌ర్‌లో సినిమాలే తగ్గిపోయాయి. దీంతో చాలా కాలం తర్వాత వస్తున్న ఓ మిస్టరీ జోనర్ మూవీ కావడంతో డైరెక్ట‌ర్‌ల‌ని ఎలా డీల్ చేస్తాడు.. సినిమాతో మంచి సక్సెస్ ఇస్తాడా.. లేదా.. అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.