వాళ్లందరూ నాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్.. ఎవరి గురించంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. అలాంటి కుటుంబంలో.. గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణుల మధ్య జరిగిన గొడ‌వ‌తో.. మోహన్ బాబు తో పాటు.. ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో.. మనోజ్ ఇల్లు వదిలి బయటకు వచ్చేసాడు. ఆ టైంలో మనోజ్ కు సపోర్ట్ గా నిలిచిన ఏకైక వ్యక్తి మంచు లక్ష్మి. అయితే.. తన తమ్ముళ్లు ఇద్దరు గొడవపడినా.. తాను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. చివరకు.. మోహన్ బాబు, విష్ణు పై కూడా మనోజ్ కేసు పెట్టిన నెమ్మదిగా గొడవలు సర్దుమనిగినట్లు అనిపించాయి.

Social Media war between Manchu Vishnu and Manoj - Telugu360

అయితే.. తాజాగా ఈ వివాదాల గురించి మంచి లక్ష్మి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. మొద‌ట‌.. నా కూతురు విష్ణు వాళ్ళ స్కూల్లోనే చదివింది. ఆరు నెలలు వెళ్లిన తర్వాత.. ఆమెను సడన్గా మాన్పించేశా. కుటుంబంలో గొడవలు జరగడం కామన్. అందరూ నా కూతురిపై ఎక్కువ కేర్ చూపించడం.. అందరిలా కాకుండా స్పెషల్ ఫోక‌స్‌.. తనకు సేవలు కూడా చేసేవారు. అవన్నీ నాకు నచ్చక.. నా కూతుర్ని చిన్న స్కూల్ కి పంపించా అంటూ వివరించింది.

ఇక.. కుటుంబంలో గొడవలపై మాట్లాడుతూ.. నేను మనోజ్ మీరాయి సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన దాన్ని కట్ చేసి.. చాలా తప్పుగా ప్రచారం చేశారు. కేవలం విష్ణు గురించి మాట్లాడకపోయినా.. తిట్టినట్లు థంబ్‌నెయిల్స్ పెట్టి దాన్ని తెగ వైరల్ చేశారు అంటూ వివరించింది. తన తమ్ముళ్ళ మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసే వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు.. వారి కర్మకి వారు అనుభవిస్తారంటూ మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి.