టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత.. కొద్ది గ్యాప్ తీసుకుని విశ్వంభర సినిమా షూట్‌ను కంప్లీట్ చేసుకున్నాడు. అయితే.. ఈ సినిమా విఎఫెఎక్స్, గ్రాఫికల్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో మెగాస్టార్ మరో ప్రాజెక్ట్ లోకి షిఫ్ట్ అయ్యాడు. అదే అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరుతో చేస్తున్న సినిమా కావడం.. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా వస్తుండడం.. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండడం సినిమాపై భారీ హైప్‌ని పెంచశాయి. వీటన్నింటికీ తోడు ఇటీవల రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో తెలిసిందే.
యూట్యూబ్లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో.. సినిమాకు ఓ పెద్ద చిక్కు ఎదురైందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. అనిల్ మొదటి నుంచి ప్రొడ్యూసర్లకు అనుకూలంగా ఉండే డైరెక్టర్. అతి తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తూ వాళ్లకు మంచి లాభాలను అందిస్తుంటాడు. ఈ క్రమంలోనే.. తాను ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమా తక్కువ బడ్జెట్‌తో.. అతి తక్కువ టైం స్పేస్‌తో షూట్‌ను కంప్లీట్ చేసి రిలీజ్ చేసింది. అంతేకాదు.. ఈ సినిమాలన్నీ మంచి సక్సెస్‌లో అందుకుని ప్రొడ్యూసర్లకు భారీ లాభాలనే తెచ్చిపెట్టాయి.
కానీ.. ఇప్పుడు మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయంలో ఆ బడ్జెట్ లెక్క తప్పిందని.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సినిమా షూట్ మొత్తాన్ని వీలైనంత తక్కువ బడ్జెట్‌లో కంప్లీట్ చేయడానికి అనిల్ ప్రయత్నించినా.. స్టార్ కాస్టింగ్ రమ్యునరేషన్ కారణంగా బడ్జెట్ బోర్డర్స్ దాటేసిందని టాక్. ఒక మెగాస్టార్ కే రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తుండగా.. అనిల్ రావిపూడి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక.. హీరోయిన్ నయనతార రూ.10 కోట్లు.. కీలకపాత్రలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ కు రూ.20 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇలా.. సినిమాకు కీలకమైన నలుగురి రెమ్యునరేషన్లే దాదాపు రూ.155 కోట్లు అయిపోయాయి. ఇక సినిమా షూట్ బడ్జెట్ మొత్తం కలిపి రూ.200 కోట్లకు చేరుకుందని తెలుస్తుంది. కాగా.. ఈ క్రమంలోనే సినిమాకు అసలు ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందా అనే సందేహాలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. కారణం.. సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే రూ.400 కోట్ల గ్రాస్ కచ్చితంగా రాబట్టాల్సి ఉంది. అంత గ్రాస్ సంక్రాంతిలో నాలుగైదు సినిమాలకు పోటీపడి మరి రావడం అంటే కష్టమే అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇక మొదటి రోజు రూ.100 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవికి ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే బిజినెస్ సైతం నిర్మాతల కోరుకున్న రేంజ్ లో జరగడం లేదట. మరి రాబోయే రోజుల్లో ఈ రేంజ్ బడ్జెట్ తో.. బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి.



