కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దుల్కర్ నటించిన మూవీ కాంతా. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నవంబర్ 14న ఆడియన్స్‌ను పలకరించనుంది. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ నేపథ్యంలో.. మూవీ స్టోరీ కి సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. కాంత ఓ లెజెండ్ స్టార్ హీరో బయోపిక్ అంటూ టాక్ నడుస్తుంది. ఆ నటుడు మరెవరో కాదు.. ఎంకే త్యాగరాజ్ భగవతార్. తన జీవిత ఆధారంగానే సినిమా రూపొందిందని టాక్.

ఇక ఈ హీరో గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో మొట్టమొదటి ఇండియన్ సూపర్ స్టార్ గా ఆయన ఓ వెలుగు వెలిగాడు. 14 సినిమాలు చేస్తే.. 10 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా హరిదాస్ అనే సినిమా సంచలనం సృష్టించింది. అయితే.. ఆయన కెరీర్‌లో ఓ డైరెక్టర్‌తో జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. అతనిపై పగ తీర్చుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే.. ఆ దర్శకుడు ఓ జర్నలిస్ట్ హత్యను ఎంకే త్యాగరాజు మీద మోపి.. రెండేళ్లు జైలుకు పంపించాడు.
జైలు నుంచి బయటకు వచ్చిన ఎంకేటి.. మరోసారి సినిమాల్లో నటించడానికి ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ఇక అప్పటివరకు లగ్జరీ లైఫ్ ను చూస్తున్న ఆయన.. అనారోగ్యంతో 49 ఏళ్లకే తుది శ్వాస విడిచాడు. ఇప్పుడు.. ఆయన బయోపిక్ గా కాంతా సినిమా రూపొందిస్తున్నారంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. ఎంకేటి రోల్‌లో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా.. డైరెక్టర్‌గా సముద్రఖని మెరవనున్నాడని సమాచారం. మరి.. ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

