టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రజెంట్ 9వ సీజన్ కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రతి సీజన్లోనూ.. కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులతో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం షో లో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ మధ్య మాజీ కంటెస్టెంట్ విష్ణు ప్రియ.. బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టెలివిజన్ షా.. పోవే పోరా తో హోస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు అందరినీ ఫిదా చేసింది. తన గ్లామర్ లుక్ తో సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ.. యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ గా విష్ణుప్రియ సందడి చేసింది.
![]()
అక్కడ తన తోటి కంటెస్టెంట్ పృథ్వి తో ఉన్న ఫ్రెండ్షిప్, కెమిస్ట్రీ కారణంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో విష్ణుప్రియ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది. తను చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. బిగ్ బాస్ నేను డబ్బుల కోసమే వెళ్ళా. ఆ డబ్బుతో కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా. కానీ.. అది వర్కౌట్ కాలేదు. ఇప్పటికి నేను నా పాత ఇంట్లోనే ఉంటున్నా. వాస్తవం చెప్పాలంటే.. బిగ్ బాస్ షోలో పాల్గొనడం నా లైఫ్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటూ వివరించింది.
ఈ షో లో నేను ఏమీ నేర్చుకోలేదు.. మళ్ళీ ఆఫర్ వచ్చినా వెళ్ళనే వెళ్ళను.. వెళ్ళినందుకే ఇప్పటికి తిట్టుకుంటున్న.. ఎందుకు వెళ్లాను అనిపిస్తుంది.. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అనిపిస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్నారు. విష్ణు ప్రియ వాస్తవాన్ని చాలా ధైర్యంగా చెప్పిందంటూ.. మరికొందరు ఇలాంటి విషయాలను పబ్లిక్ గా రివీల్ చేస్తే మీకు ఫ్యూచర్ కష్టమే అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక విష్ణు ప్రియ చేసిన ఈ కామెంట్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్‌లోను హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఈ షో వెనుక ఉన్న రియాలిటీ ఇదే కావచ్చు అంటూ తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.

