టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతలు అనగానే టక్కున గుర్తుకొచ్చే అతి కొంత మంది పేర్లలో అల్లు అరవింద్ పేరు కూడా ఒకటి. గీత ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి 50 ఏళ్ల నుంచి ఎన్నో బ్లాక్‌బస్టర్లను టాలీవుడ్‌కు అందించిన అల్లు అరవింద్.. ముఖ్యంగా తన బావ చిరంజీవితో కలిసి చాలా సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో చెక్కుచెదరని రికార్డులను క్రియేట్ చేశారు. ఇక.. రామ్‌చరణ్ తీసిన మగధీర అయితే ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ముందు ఆయన బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో గజినీ సినిమాను రీమేక్ చేసి.. మొట్టమొదటిసారి బాలీవుడ్‌కు రూ.100 కోట్లు సినిమాను అందించిన రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అల్లు అరవింద్ కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు ఉన్నాయి.
అయితే.. ఇటీవల కాలంలో ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయడం తగ్గించేశారు. తక్కువ బడ్జెట్‌తో మంచి క్వాలిటీ గా ఉండే చిన్న సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవల కాలంలో అల్లు అరవింద్ సినిమాలన్ని మంచి సక్సెస్ అందుకోవడం విశేషం. రీసెంట్గా బ్యానర్ నుంచి కాంతార సినిమా రిలీజై ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే బ్యానర్ పై రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కేందుకు సిద్ధమవుతుంది. నవంబర్ 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్గా వచ్చి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక ఈ సినిమా మరికొద్ది గంటల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న క్రమంలో.. వరుస ప్రెస్మీట్‌లో టీమ్ సందడి చేస్తున్నారు. అంతేకాదు.. తాజాగా జరిగిన ప్రెస్మీట్‌లో అల్లు అరవింద్ సైతం ఆ సినిమాను ప్రమోట్ చేశాడు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన జర్నలిస్టులతో మాట్లాడుతూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా విలేకర్లు అల్లు అరవింద్ మీరు స్థాపించిన ఆర్ట్స్‌కి 50 సంవత్సరాల హిస్టరీ ఉంది. కానీ.. ఇటీవల కాలంలో ఈ బ్యానర్‌లో ఇతర నిర్మాతలు లాగా భారీ బడ్జెట్ సినిమాలు రావడం లేదు. చిన్న సినిమాల సైడ్ గా వెళ్తున్నారు.
బిగ్ సినిమాల రిస్క్ ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించగా.. దానికి అల్లు అరవింద్ రియాక్ట్ అవుతూ.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా నాకు రిస్కీ ప్రాజెక్ట్. ఇండస్ట్రీలో ఏ నిర్మాత అయిన సినిమా తీయడం అంటేనే రిస్క్. రూ.450, రూ.500 కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయడం లేదని డైరెక్ట్ గా అడగండి సమాధానం చెప్తా అన్నాడు. అయితే చెప్పండి అని విలేకరు ప్రశ్నించగా.. చరణ్, బన్నీ లాంటి వాళ్ళని పెట్టుకుంటే వాళ్లు ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకుంటారు. బడా ప్రాజెక్టులు చేయాల్సి వస్తుంది. మళ్లీ ఆ డబ్బు ఎలాగో మా ఇంటికి తీసుకొచ్చేస్తారు. కనుక మా డబ్బులు మేము ఇచ్చి మళ్లీ మా ఇంటికి ఆ డబ్బులు తీసుకోవడం కన్నా.. బయట వాళ్లకు డబ్బులు ఇవ్వడమే బెటర్ కదా.. అని బన్నీ, చరణ్‌లతో సినిమాలు చేయడం లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అల్లుఅరవింద్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.




