టాలీవుడ్లో తాజాగా రిలీజ్ అయిన సినిమాల్లో.. రాజు వెడ్స్ రాంబాబు సినిమా ఒకటి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సంచలనం సృష్టించింది. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే ఆయినా.. సినిమా ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే అంచనాలను మించి సినిమా కలెక్షన్లు రాబడుతుంది. నవంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా.. గ్రాండ్ లెవెల్లో సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా రూ.10 కోట్ల కలెక్షన్లకు చేరువ అవడం విశేషం. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే లాభాల బాటలో పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే.. నిర్మాతలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాట్టీ తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్ హీరోగా, తేజస్విని హీరోయిన్గా మెరిశారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. సాయిలు కొత్త డైరెక్టర్ అయినా.. తన టేకింగ్, మేకింగ్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇక.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న క్రమంలో.. తాజాగా సక్సెస్ యీట్ ఏర్పాటు చేశారు మూవీ టీం. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. తన బ్యాక్ గ్రౌండ్‌ను రివీల్ చేశారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నాడు. రాజు వెడ్స్ రాంబాబు 2004లో నిజంగా జరిగిన కథ అని.. అప్పటికీ మేము చాలా చిన్న పిల్లలం అంటూ చెప్పుకొచ్చాడు.

అప్పట్లో ఈ కథ సెన్సేషన్. ఈ కథని మా నాన్న వాళ్లంతా ఎక్కువగా వినేవాళ్లు. ఇక మా పెదనాన్న నక్సలైట్. అప్పట్లో నాకు పెద్దగ దాని గురించి తెలియదు. కానీ.. కొన్ని రోజుల తర్వాత మాత్రం ఇది నన్ను అలానే వెంటాడుతూ వచ్చింది. ఈ వెలుగులోకి రాని కథను అందరికీ చెప్పాలని తెలిసింది డోలాముఖి ఫీలిమ్స్ బ్యానర్ క్రియేట్ అయింది అంటూ వివరించాడు. సాయిలు కంపాటి మొత్తానికి ఓ వైవిధ్యమైన కథతో ఆడియన్స్‌లో సత్తా చాటుకున్నాడు. అయితే.. కథని ఎంచుకోవడానికి తనకున్న నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ ప్రధాన కారణమట. ఇక.. ఈ సినిమా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా డైరెక్టర్ మాట్లాడుతూ.. చెప్పొచ్చో, లేదో అంటూ డౌట్ గానే రివీల్ చేశాడు. అలాగే విలన్ గా నటించిన వెంకన్న గురించి మాట్లాడుతూ.. సూసైడ్ చేసుకొని చనిపోయాడని వివరించాడు సాయిలు. ప్రస్తుతం తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

