టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుంత పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న.. ఈ బడ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతుంది. అయితే.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసౄర్ మాట్లాడుతూ మూవీపై చేసిన కామెంట్స్ అంచనాలను ఒక్కసారిగా డబల్ చేశాయి.
తాజాగా మీడియాతో మాట్లాడిన రవి.. డ్రాగన్ సినిమా గురించి షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా కేజీఎఫ్, సలార్‌లను మించిపోయి ఉంటుందని స్ట్రాంగ్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇక ప్రశాంత్ నీల్‌తో కేజిఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాల తర్వాత.. మళ్లీ పని చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఈ టీంతో కలిసి వర్క్ చేస్తే.. సొంత ఇంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్న అనుభూతిని వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాకు, ప్రశాంత్ కు మధ్యన మాటలు పెద్దగా ఉండవు.. కానీ.. పని మాత్రం ఎక్కువగా ఉంటుందంటూ వివరించాడు. డ్రాగన్ లో విజువల్స్ తో పాటు.. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
![]()
ఇక యాక్షన్ తో పాటు.. ఎమోషన్స్ కు కూడా సినిమాలో పెద్దపీట వేశారని.. కచ్చితంగా అవి ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్ నీల్ గత సినిమాలన్నింటికీ భిన్నంగా ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ఉంటుందని.. సరికొత్త తరహా మ్యూజిక్ అందిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. దేనికోసం ఇప్పటికే ఎన్నో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ప్రయోగించామని.. రవి బసౄర్ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. తారక్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాతో కచ్చితంగా ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంటాడంటూ.. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

