టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా ఎస్, ఎస్, థమన్ పేరు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఏ రేంజ్‌లో మారు మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్‌తో సంచలనాలు క్రియేట్ చేస్తూ.. ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న థమన్.. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆరు నెలల ముందు నుంచే ఆల్బమ్ సందడి మొదలు పెట్టేస్తాడు. సినిమా భారానంతా భుజాలపై వేసుకొని ఒక్కో పాటను ఒక్కో ఈవెంట్‌లా ప్రమోట్ చేస్తూ.. హైప్ పెంచేస్తాడు. అల వైకుంటపురం తో మొదలై.. రీసెంట్ గా వచ్చిన ఓజీ వరకు.. ఆయన మ్యూజిక్ సినిమాని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే సినిమాకు హైప్ తేవడంలో.. కింగ్ అని థమన్ కు ఒక మార్క్ క్రియేట్ అయింది. కాగా.. ప్రతి సినిమా విషయంలోనూ ఈ రేంజ్ లో మూత మోగించేసే థమన్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా విషయంలో మాత్రం థమన్ నుంచి చప్పుడే లేదు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రాజాసాబ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు మరో రెండు నెలలు టైం మాత్రమే మిగిలి ఉంది. అంతేకాదు.. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాం పెంచింది.
అలాంటి పెద్ద సినిమా సంక్రాంతి లాంటి ఫెస్టివల్ కు వస్తుందంటే.. ఆ సినిమా నుంచి వచ్చే మ్యూజిక్ ఏ రేంజ్ లో మూత మోగించాలో.. జనాల్లో ఎంత హైప్‌ను క్రియేట్ చేయాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ.. రాజాసాబ్ టీం మాత్రం.. ఈ విషయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటున్నారు. అయితే.. మేకర్స్ నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ.. సినిమాకు అస్సలు హైలైట్ అయిన మ్యూజిక్ ప్రమోషన్స్ మాత్రమే ఇంకా మొదలే కాలేదు. కనీసం ఫస్ట్ సింగిల్ అప్డేట్ ని కూడా మేకర్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి మ్యూజిక్ సెన్సేషన్ సినిమాకు పని చేస్తున్న కూడా ఈ నిశ్శబ్దం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.



