ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్ట పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. సౌత్, బాలీవుడ్ అని లేకుండా.. ఇండియన్ సినిమాగా తెరకెక్కి.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సౌత్ సెలబ్రిటీస్ బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని సందడి చేస్తుంటే.. మరోపక్క సౌత్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కీలక పాత్రల్లో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు.. సౌత్ సెలబ్రిటీలకు నార్త్ సినిమాల్లో అవకాశాలు రావడం అంటే పెద్ద అడ్వెంచర్. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ ఆస్కార్ రేంజ్ కు ఎదిగింది.

ఈ క్రమంలోనే అందరి చూపు సౌత్ సెలబ్రిటీలపై పడింది. అట్లీ, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తో సినిమాలు చేయాలని బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ సైతం భావిస్తున్నారు. తాజాగా.. బాలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్‌లో డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వరుస బ్లాక్ బస్టర్‌లు అందుకుంటూ.. బాలీవుడ్‌లో తిరగలేని క్రేజ్ సంపాదించుకున్న ఓ స్టార్ హీరో.. ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవల తెలుగులో కేవలం గెస్ట్ రోల్‌లో కనిపించిన హీరో.. మొదటిసారి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో లీడ్ హీరోగా మెరవనున్నాడంటూ టాక్ నడుస్తుంది.

అది కూడా.. కేవలం ఒక సినిమాకు కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేయనున్న ప్రాజెక్ట్ అని.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానుందని టాక్. ఇంతకీ ఆ బాలీవుడ్ సూపర్ స్టార్ మరెవరో కాదు షారుక్ ఖాన్. షారుక్ తొలిసారి స్ట్రైట్ తెలుగు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇంతకీ షారుక్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ ఎవరంటె.. ఉప్పెన ఫేబ్.. బుచ్చిబాబు సనా. ఇప్పటికే బుచ్చిబాబు చరణ్‌తో పెద్ది సినిమా చేస్తున్నాడు. కాగా ఇలాంటి క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం షారుక్‌ను అప్రోచ్ అయ్యాడట బుచ్చిబాబు. చాలా స్పెషల్, ఎమోషనల్, యాక్షన్ టచ్‌తో డిజైన్ చేశాడని.. రెండు గంటల పాటు జరిగిన ఈ స్టోరీ నరేషన్ షారుక్ తెగ నచ్చేసింది అని వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక కింగ్ కాంగ్ మొదటిసారి స్ట్రైట్ తెలుగు సినిమాలో నటిస్తున్న క్రమంలో.. తెలుగు ఆడియన్స్‌లోను ఈ సినిమాపై హైన్ మొదలైంది.

