బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్ లో ఏకంగా ముగ్గురు.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రాసవాత్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం 9వ వారం హౌస్ లో దెయ్యాలు, టాస్కులు ,ఫోన్ కాల్స్ ఆడుకోవడం, అరుపులు, వివాదాలతో రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ మిడ్ వీక్ రానే వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే హౌస్ నుంచి 8 మంది ఏలిమినేట్‌ కాగా.. మళ్లీ వాళ్లలో ఒకడైన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు 9లో 14 మంది కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు. వారికి బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ నిర్వహించగా భరణి, సాయి ,తనుజ, కళ్యాణ్, సుమన్, రాము, సంజన.. ఏకంగా ఏడుగురు నామినేషన్స్ నిలిచారు.

Bigg Boss Telugu 9 Nominated Contestants Week 9 Viral Post (November 3,  2025) | Bigg Boss Telugu 9 Nomination Twist Week 9 | Who Are Nominated On Bigg  Boss Telugu 9 Week

ఇక ఈ నామినేషన్స్ కంప్లీట్ అయిన వెంటనే.. బిగ్ బాస్ ఓటింగ్ పోల్ మొదలైపోయింది. ఈ క్రమంలోనే తాజాగా రోజురోజుకు ఓటింగ్స్‌ తారుమారవుతూ.. స్థానాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు బిగ్ బాస్ నామినేష‌న్స్‌లో ఉన్న.. ఓటింగ్‌తో టాప్ 1 లో ఉండే తనుజ.. ఈ వారం మాత్రం సెకండ్ ప్లేస్ కు మారిపోయింది. టాప్ 1లోకి కళ్యాణ్ చేరుకోవడం విశేషం. ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్లో కళ్యాణకు 27.26% ఓటింగ్ వచ్చి మొదటి స్థానంలో నిలవ‌గా.. తనుజ 20.7% ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో, సంజనా గలరని 12.73% ఓటింగ్ 3వ ప్లేసులో, భరణి 12.64% ఓటింగ్ తో 4వ‌ స్థానంలో, సాయి శ్రీనివాస్ 10 . 61% ఓటింగ్ తో 5వ స్థానంలో నిలిచారు.

ఇక చివ‌ర్లో 10.53% ఓటింగ్ తో సుమన్ శెట్టి, 6.37 ఓటింగ్ తో రాము రాథోడ్ మిగాలారు. అలా.. చివరి మూడు స్థానాల్లో సాయి, సుమన్, రాము ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఓటింగ్ కు మరికొంత సమయం మిగిలి ఉండడంతో.. ఈ ముగ్గురిలో ఫైనల్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓట్స్ ప్రకారం అయితే రాము రాథోడ్ కే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొదటి నుంచి సుమన్ శెట్టి తన క్రేజ్‌తో నామినేషన్స్‌లో సేవ్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే.. సుమన్ శెట్టి ఈ సారి కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక గేమ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవ‌డంతో సాయి శ్రీనివాస్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే రాము రాథోడ్‌, సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు హౌస్ లో ఉంటారో వేచ్చి చూడాలి.