బిగ్ బాస్ 9: ఆ ఒక్కడు తప్ప నామినేషన్స్ లో హౌస్ మొత్తం..

బిగ్బాస్ సీజన్ 9 ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మునిపెన్న‌డు లేని రేంజ్ లో ఈ సీజన్లో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఫైట్స్.. బిగ్ బాస్ దానికి అనుగుణంగా ఇచ్చే టాస్కులు.. నామినేషన్ ఎపిసోడ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ చరిత్రలోనే లేని విధంగా ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు కెప్టెన్ గా నిలిచి ఇమ్ము రికార్డ్‌ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా మరో కొత్త రికార్డ్‌ బిగ్ బాస్ లో క్రియేట్ అయింది. అదే.. పదవ వారం జరిగిన నామినేషన్ ప్రాసెస్. బిగ్‌బాస్.. కంటెస్టెంట్ లందరికీ బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు.

మునుపెన్నడు లేని రేంజ్‌లో హౌస్‌లో 11 మంది సభ్యులు ఉంటే.. ఇంకా 6 వారాల సమయం మిగిలిన‌ నేపథ్యంలో.. నామినేషన్ ప్రాసెస్ మామూలుగానే మొదలుపెట్టి.. వాళ్లకే షాప్ ఇస్తూ.. ఏకంగా 11 మందిని నామినేట్ చేశాడు. అందరిని గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి.. ఓ టైమ్ లిమిట్ పెట్టిన బిగ్ బాస్.. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని.. మీ నామినేషన్ కేవలం 5 నిమిషాల్లో పూర్తవ్వాలంటూ వివరించాడు. అలాగే నామినేట్ అయిన వాళ్ళు షవర్ కింద కూర్చోవాలి వారిపై బురద నీళ్లు పడతాయి అంటూ వివ‌రించాడు. ముందుగా ఇమ్మానియేల్ నామినేషన్స్ మొదలెట్టాడు. భరణిని నామినేట్ చేసి లాస్ట్ వీక్ లో కెప్టెన్సీ టెస్ట్ లో తనుజ కోసం గివ‌ప్ ఇచ్చేయడం నాకు నచ్చలేదు అంటూ తన పాయింట్ చెప్పి నామినిట్ చేశాడు.

ఆ తర్వాత రీతు దివ్య నేను నామినేట్ చేసి.. కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో సాయికి ఒకరిని తీసే ఛాన్స్ వస్తే అతను మొదట నిన్ను ఎలిమినేట్ చేయాలనుకున్నాడు.. కానీ నువ్వు అతన్ని మ్య‌నిప్లేట్ చేసి.. నన్ను ఎలిమినేట్ చేయాలని ప్రయత్నించావు. ఇలా నువ్వు హౌస్ లో ఒక గ్యాంగ్ క్రియేట్ చేసి గేమ్ ఆడుతున్నావ్.. వాళ్ళు వినాలని చూస్తున్నావ్.. నీకు అవసరం వచ్చినప్పుడు బాణాల వాళ్ళని వాడుతున్నావ్ అంటూ తన పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. గౌరవ్.. సంజనాన్ని నామినేట్ చేశాడు. కళ్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేస్తే.. దివ్య, గౌరవనీ.. ఇక సుమన్ శెట్టి.. నిఖిల్‌ను.. తనుజ కూడా గౌరవ్‌ను.. ఆ తర్వాత డిమోన్‌ సైతం గౌరవ్‌ని నామినేట్ చేయడం జరిగింది. భరణి వచ్చి దివ్యని నామినేట్ చేయ‌డం.. నిజంగానే బిగ్ షాక్. ఇక సంజనకి ఛాన్స్ ఇవ్వగానే గౌరవ్‌ని నామినేట్ చేసింది. చివరి ఛాన్స్ నికిల్‌కు వచ్చింది. రీతూని నామినేట్ చేస్తే తన పాయింట్లు వెల్లడించాడు.

నామినేషన్ పూర్తయిన తర్వాతే బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు నా వంతు.. మీ పట్ల మీ ఆట పట్ల ప్రేక్షకులకి ఉన్న అభిప్రాయం మీరు తీసుకోవాల్సిందే. ఆ సమయం ఇప్పుడే వచ్చిందని.. నేను ఫిక్స్ అయ్యా. అందుకే ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు అందరిని డైరెక్ట్ నామినేట్ చేస్తున్నా. ఈ నామినేషన్స్ మీ కళ్ళు తెరిపిస్తాయా.. మీకోసం బిగ్ బాస్ ఇంటి గేట్లు తెరిపిస్తాయా.. ఈ వారం మీకోసమే మీరు చేసే యుద్ధం నిర్ణయిస్తుందంటూ వివరించాడు. హౌస్ లో ఉన్న వాళ్ళంతా డైరెక్ట్ గా నామినేట్ అవుతారు.. ఈసారి నామినేషన్ లో కెప్టెన్ కూడా ఉండొచ్చు. కెప్టెన్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వాల లేక నామినేట్ అవ్వాలనే నిర్ణయం మాత్రం హౌస్ మెట్స్‌ తీసుకోండి అంటూ బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియను మొదలు పెట్టాడు. హౌస్ లో భరణి తప్ప మిగిలేని వాళ్లంతా ఇమ్ముకి కెప్టెన్సీ ఇమ్యూనిటీ దక్కాలని ఓట్ చేశారు. దీంతో ఇమ్మానియేల్ మళ్ళీ సేఫ్ అయిపోయాడు. ఫైనల్ గా ఇమ్ము తప్ప మిగిలిన పదిమంది నామినేషన్స్ లో ఉన్నారని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.