బిగ్‌బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవ్తరంగా కొనసాగుతుంది. తాజాగా.. పదవ వారం నామినేషన్స్ మొదలైపోయాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియను మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కొన్ని ట్విస్ట్‌లు ఇచ్చాడు. నామినేషన్లో భరణి, దివ్యల మధ్యన చిచ్చు చెలరేగేలా ప్లాన్ చేశాడు. మరి.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు. ఎవరి మధ్యన ఎలాంటి గొడవలు తలెత్తాయి.. ఒకసారి చూద్దాం. ఈ వారం నామినేషన్ కు టైం లిమిట్ ఉందని.. రోజంతా సాగదీయడం కుదరదు అని.. కేవలం 5 నిమిషాలే నామినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ సూచించాడు. ఈ వారం నామినేషన్ మీ అంచనాలను తలకిందలు చేస్తుందంటూ వెల్లడించాడు. కేవలం 5 నిమిషాల సమయంలోనే నామినేషన్స్ కంప్లీట్ అవ్వాలంటూ ప్రోమో మొదలైంది.
నామినేట్ చేయాలనుకుంటున్నా ఒక్కొక్కరిని బలమైన కారణంతో మీ దగ్గర ఉన్న షవర్ దగ్గర కూర్చోబెట్టాలని బిగ్ బాస్ సూచించాడు. దీంతో.. నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మొదట కెప్టెన్ ఇమ్ము భరణిని నామినేట్ చేస్తూ.. మీరు ఎందుకో ఆలోచనలో వెనుకబడుతున్నారేమో అనిపించింది. అదే నా పాయింట్ అంటూ చెప్పాడు. నామినేషన్ చేయకుండా ఇకనుంచి మీరు కొత్త భరణిని చూస్తారని భరణి అన్నాడు. మీరు మళ్ళీ వచ్చాక కనిపించిన ఫైర్.. ఇప్పుడు తగ్గిపోయిందంటూ ఇమ్ము వివరించాడు. నాకంటే తనుజ బెటర్ అని నిర్ణయం తీసుకున్నా అని భరణి చెప్పగానే.. మీరెందుకు అవ్వకూడదని తాట్ రావట్లేదా అంటూ ప్రశ్నించాడు.. మీకు మీరు స్టాండ్ తీసుకోవట్లేదు అంటే.. అదే చెప్తున్నా అని భరణి వివరించాడు.

అవతలి పర్సన్ కి మీరు ఎంత చేశారో.. మీకు తెలుసు అంటూ ఇమ్ము వివరించాడు. ఇక ఈ ఎపిసోడ్ తర్వాత రీతూ తివ్యను నామినేట్ చేసి.. ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ఒక గ్యాంగ్ అయి ఆట ఆడుతున్నావని పాయింట్ రైజ్ చేసింది. అంతేకాదు.. నువ్వు వాళ్ళని కామెండ్ చేస్తున్నావంటూ వివరించింది. ట్రైన్ టాస్క్ లో కూడా నువ్వు చెప్పినట్లు వాళ్ళు గేమ్ ఆడారు.. నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలన్నట్టు నువ్వు వ్యవహరిస్తావు.. నీ ఆలోచన అలానే ఉంటుందంటూ రీతు.. దివ్యను నామినేట్ చేసింది. వాళ్ళు నా మాట వింటే.. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి.. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అంటూ దివ్య రివర్స్ కౌంటర్ ఇచ్చింది. తర్వాత వచ్చిన గౌరవ్.. సంజనను నామినేట్ చేస్తూ స్టైలిష్‌గా ఉంటారు.. మీ ఫుడ్ గురించి మీరు ఆలోచిస్తారు.. సెల్ఫ్ డ్రామా చేస్తారు అంటూ వివరించింది. కళ్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేస్తూ నువ్వు గేమ్‌లో మరింత స్ట్రాంగ్ అవ్వాల్సి ఉందని కొన్ని రిజన్స్ కూడా చెప్పాడు. మరి ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారో.. ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతాయో ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.


