టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాను.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక.. గత కొంతకాలంగా రామ్ చేసిన సినిమాలు వరుసగా డిసప్పాయింట్మెంట్ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డబల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత రామ్ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎంచుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక రామ్ తాజాగా నటించిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయినా ఈ సినిమాపై రిలీజ్కు ముందు వరకు ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
![]()
కానీ.. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. పాజిటివ్ రివ్యూస్ తో సినిమా దూసుకుపోతుంది. సినిమా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయమని.. రామ్ మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడంటూ టాక్ వైరల్ అవుతుంది. ఇక సినిమాలో రామ్ లుక్, పెర్ఫార్మెన్స్, స్క్రీన్ పైజన్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడు చూడని కొత్త స్టైల్ లో ఫుల్ ఆఫ్ ఎనర్జీతో రామ్ లుక్ సినిమాకు పెద్ద ప్లాస్ పాయింట్ గా మారిందని.. ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రామే అసలైన కింగ్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోని రామ్ సినిమా కోసం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
![Andhra King Taluka | Ram Pothineni | Bhagyashri Borse | Mahesh Babu P [HD] (Video) - Social News XYZ](https://i2.wp.com/socialnews.xyz/wp-content/uploads/2025/07/18/maxresdefault-27.jpg)
కాగా.. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న.. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా అంచనాలు లేవు. ఈ క్రమంలోనే అతి తక్కువ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం రామ్ కేవలం రూ.17 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. వరుస ఫ్లాప్ల కారణంగా మేకర్స్ పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేయలేదని.. అదే టైంలో సినిమాస్ హిట్ లేకపోవడంతో తనకు కెరియర్ ముఖ్యమని భావించిన రామ్ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాజిటీవ్ టాక్ దక్కించుకుంటున్న క్రమంలో.. సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. రామ్ పర్ఫామెన్స్కు రెమ్యునరేషన్ మరి కాస్త ఆదనంగా మేకర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నారు రామ్. తను స్క్రిప్ట్ పై పెట్టిన నమ్మకం, నటనతో పడిన కష్టానికి.. తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుందని.. కలెక్షన్లతో సినిమా రికార్డు కొల్లగొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

