ఇండస్ట్రీ ఏదైనా సరే.. హీరోయిన్గా అడుగుపెట్టిన వాళ్లు ఏదోక సందర్భంలో నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ముద్దుగుమ్మలు కొన్నిసార్లు.. ఆ సినిమాలు ప్లాప్ అయితే తామే ఆ సినిమా ఫ్లాప్ కు బాధ్యులనే నిందలు కూడా మోయాల్సి వస్తుంది. అలాంటి అనుభవమే తన కెరీర్ లోను ఉన్నాయంటూ మీనాక్షి చౌదరి వివరించింది. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో వరుస చాన్స్‌లు అందుకుంటుంది.
అలా మహేష్ గుంటూరు కారంతో ఆమె ఫేమ్ డబల్ అయింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ హిట్, తర్వాత.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా కూడా మంచి రిజల్ట్ అందుకుంది. దీంతో.. అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో మీనాక్షి తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ నటిగా ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నటనకు ఇచ్చే విలువ తెలుస్తుంది. కానీ.. ఇకపై పిల్లల తల్లిగా కనిపించే పాత్రలో మాత్రం నటించను. లక్కీ భాస్కర్ లో ఆ పాత్ర కథ నచ్చి చేశా.
కానీ.. ఇకపై అలాంటి రోల్స్ వస్తే నో చెప్పేస్తా. ఇక ఎజ్తో సంబంధం లేకుండా.. ఏ హీరోలతో అయినా కలిసి సినిమాలు చేయడానికి నాకు ఇబ్బంది లేదు. అలా చేసే అవకాశం వస్తే దాన్ని కొత్త జానెర్ గానే తీసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే.. వెంకటేష్ గారితో కలిసి నటించిన సంక్రాంతి వస్తున్నాం షూట్ ను నేను చాలా ఎంజాయ్ చేశా.. చిరు గారితో విశ్వంభర సినిమా చేస్తున్నా. అది నా కెరీర్లోనే స్పెషల్ చాప్టర్ గా నిలుస్తుందని నమ్ముతున్నా అంటూ వివరించింది. ఇక రూమర్స్ గురించి అమె రియాక్ట్ అవుతూ.. నా గురించి ఏదైనా చెప్పాలంటే నేనే స్వయంగా చెబుతా. నాకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కనుక ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం ఉండదు అని వివరించింది.



