స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న సమంత.. మహేష్, పవన్, తారక్, చరణ్, బన్నీ, నాని, నాగచైతన్యలతో నటించింది. అటు కోలీవుడ్‌లోను సూర్య, విజయ్, విక్రమ్, కార్తి, శివ కార్తికేయన్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో మెరిసింది. అయితే.. దాదాపు పాన్ ఇండియన్ స్టార్ హీరోస్ అందరిని కవర్ చేసిన ఈ అమ్మడు.. ఒక్క ప్రభాస్ సరసన మాత్రం నటించలేదు. ఈ క్రమంలోనే.. అసలు ప్రభాస్, సమంత కాంబో ఎలా మిస్సయింది.. దానికి కారణాలు ఏంటి అనే సందేహా అందరిలోనూ మొదలైయ్యాయి. అయితే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం వినిపిస్తుంది. అదే ఇద్దరి మధ్యన ఉన్న హైట్ గ్యాప్.

సమంత కంటే ప్రభాస్ 10 ఇంచులు ఎక్కువ ఎత్తు ఉండడం.. దానివల్ల ఇద్దరినీ స్క్రీన్ పై ఒకేసారి చూపించాలంటే.. సినిమాటోగ్రాఫర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక బిగ్ స్క్రీన్ పై హీరో, హీరోయిన్‌లను కలిపి చూపించాలంటే.. వాళ్ళను ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. హీరో, హీరోయిన్ సెలెక్ట్ చేసే మ్యాటర్‌లో ఇద్దరి వొడ్డు, పొడుగు కుదరాలి. చాలా విషయాల్లో ఇద్దరికీ సింక్ ఉండాలి. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అప్పుడే ఆడియన్స్ ఆ పేయిర్‌కు ఫీదా అవుతారు. ఈ క్రమంలోనే.. సమంత – ప్రభాస్ కాంబో విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయట. మరీ.. దాదాపు ప్రభాస్ అంత ఎత్తుండే మహేష్‌తో సమంత నటించింది. ప్రభాస్ తోనే ఎందుకు కాంబో సెట్ కాలేదని సందేహాలు ఉన్నా.. అది పూర్తిగా సమంత, ప్రభాస్‌ల ఛాయిస్. ప్రభాస్ తో నటించేందుకు ఆప్షన్ ఉన్నకాన్ని.. తన కెరీర్ జర్నీలో ఇప్పటివరకు ప్రభాస్‌తో నటించలేదు.
ప్రభాస్ కూడా తన ఎత్తుకు సరిపోయే హీరోయిన్స్ అనుష్క, కాజల్, నయనతార, నమితలను తన సినిమాల్లో ఎంచుకున్నాడు. అయితే.. ఇంచుమించు సమంత ఎత్తే ఉన్న త్రిష శ్రియాలతోను వర్షం, చత్రపతి సినిమాల్లో మెరుశారు. ఇప్పటికీ సమంత డార్లింగ్ తో చేయకపోవడానికి సరైన కారణం తెలియదు కానీ.. సమంతకు మాత్రం పూర్తిగా దారులు మూసుకుపోలేదు. ప్రభాస్ పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న క్రమంలో.. లోకల్ హీరోయిన్ల కంటే బాలీవుడ్ యాక్టర్ ల పైన ఎక్కువగా మగ్గు చూపుతున్నాడు. ఇటీవల.. సమంత బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుని తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తో సమంత నటిస్తే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని కాంబినేషన్లో సినిమాలు రావాలంటే దానికి కాలమే సమాధానం. ఫ్యూచర్లో అయినా ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి.


