కేవలం పెళ్లయిన కారణంతో అరుంధతి మూవీ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ లెజెండ్రి డైరెక్టర్ కోడి రామకృష్ణ తెర‌కెక్కించి.. సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో అరుంధతి సైతం ఒకటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించని ఈ సినిమా.. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2009లో రిలీజై సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా.. అనుష్క సినీ కెరీర్‌కు మైల్డ్ స్టోన్ గా నిలిచింది. కేవలం రూ.13 కోట్లతో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించింది. ఇక ఇందులో జేజమ్మ అరుంధతి పాత్రలో.. అనుష్క తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుని విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

From Arundhati to Bhaagmathie: The rise and rise of Anushka Shetty |  Hindustan Times

లేడి ఓరియంటెడ్‌ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాల్లో అనుష్క అందమైన రూపం అందర్నీ ఫిదా చేసింది. సాధర‌ణ‌ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే.. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సైతం దక్కించుకుంది. అయితే.. ఈ సినిమాకు అనుష్క కంటే ముందు ముగ్గురు హీరోయిన్ల పేర్లు అనుకున్నారట. అందులో ఒకటి మలయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్. మరొకరు సీనియర్ బ్యూటీ ప్రేమ, అలాగే ఇంకొకరు రాశి. ఈ ముగ్గురిలో మమత మోహన్ దాస్ ని కోడి రామకృష్ణ పర్సనల్గా సంప్రదించి మరి కథను వినిపించాడట. అయితే ఆమె సినిమాను వదులుకుంది. మరో హీరోయిన్ ప్రేమ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేసింది.

Actress Rashi reveals missed chance in Rangasthalam

వీళ్లిద్దరూ కాకుండా మరో స్టార్ బ్యూటీ కేవలం పెళ్లయిన కారణంతో అరుంధతి మూవీని మిస్ చేసుకుందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు రాశి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రాశి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. తన జర్నీ, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. అరుంధతిలో అనుష్క చేసిన జేజమ్మ రోల్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ వివరించింది. ఆ రోజు నేను చేసి ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నా. ఆ సినిమాకు నాకు ఏదైనా ఛాన్స్ ఉండేదా అని డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని అడిగితే.. నిన్ను ఎవరు త్వరగా పెళ్లి చేసుకోమన్నారు.. నీ పెళ్లి కారణమని అన్నార‌ని రాశి గుర్తుచేసుకుంది.