మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చి 24 గంటలు దాటుతున్నా.. ఇప్పటికీ అభిమానుల్లో ఇదే సందడి కొనసాగుతుంది. ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఈసారి.. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని.. అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. డబల్ సెలబ్రేషన్స్, డబల్ హ్యాపీ అంటూ ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే.. మెగా ఫ్యాన్స్.. ఈ సారీ కచ్చితంగా ఇంటికి వారసులు రాబోతున్నారని బుల్లి సింబ వస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాసన శ్రీమంతం గ్రాండ్ లెవెల్ లో జరిగింది.
![]()
ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట చేరి.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. మెగాస్టార్ తన కోడలు ఉపాసనకు ఏం గిఫ్టీ ఇచ్చాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. చిరంజీవి తలుచుకుంటే ఆయన రేంజ్ కు తగ్గట్టు కోట్ల విలువ చేస్తే బహుమతులు ఉపాసనకు గిఫ్ట్ గా ఇవ్వగలడు. కానీ.. ఆయన ఈసారి ఉపాసన కోసం డబ్బులతో సంబంధం లేని.. ఓ విలువైన గొప్ప బహుమతిని ఇచ్చాడట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. చిరంజీవి తన కోడలికి ఎంతో పవిత్రమైన బాబా విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇది సాధారణమైనది కాదని.. స్వయంగా షిరిడీలో ప్రత్యేక పూజలు చేయించి.. భక్తిశ్రద్ధలతో తయారు చేయించారని.. ఈ విగ్రహం చిరు తన చేతుల మీదుగా.. ఉపాసనకు అందించినట్లు తెలుస్తుంది.
![]()
ఉపాసనకు మొదటి నుంచి బాబా అంటే ఎంత ఇష్టమో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే తనకు ఎంతో నచ్చిన ఈ బహుమతిని హృదయపూర్వకంగా కోడలి కోసం ప్రజెంట్ చేశాడట చిరు. అంతేకాదు.. శుభప్రదంగా ఉంటుందని ఆధ్యాత్మిక బహుమతిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఇచ్చిన ఈ గిఫ్ట్ గురించి వైరల్ గా మారడంతో.. అంత ఫీదా అవుతున్నారు. కోడలి ఇష్టాలను తెలుసుకొని.. సంస్కృతి ఆధ్యాత్మికతను వదలకుండా.. తన రేంజ్ కు తగ్గకుండా ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారంటూ.. అది మెగాస్టార్ గ్రేట్నెస్ అంటూ.. మామగారు ఎంతో ప్రేమతో భక్తితో ఉపాసనకు ఇచ్చిన ఇంత గొప్ప గిఫ్ట్ మరెవరు ఇవ్వలేరు అంటూ అప్రశంసలు కురిపిస్తున్నారు.

