సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆయన సినిమాకు సిద్ధమవుతున్నాడు. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్.. ఈ సినిమాలతో ఆయనకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఈసారి ఏకంగా దర్శకుడుగా మారి వెంకీ తో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. త్రివిక్రమ్ స్టైల్ కామెడీ పంచ్‌లతో.. కథ సాగనుందని టాక్ ఇప్పటికే వైరల్ గా మారుతుంది.
అయితే.. హీరోయిన్గా పలువురు పేర్లు వినిపించిన తాజాగా సినిమా కోసం యంగ్ బ్యూటీ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు శ్రీనిధి శెట్టి. త్వరలో దీనిపై అఫీషియల్ ఫ్యాక్టరీ కూడా రానుందట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ – వెంకీ కాంబో సినిమాతో.. సీనియర్ హీరోలా బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయినట్టే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కుర్ర హీరోయిన్లు సైతం సీనియర్ హీరోలతో సినిమాలు చేయాలంటే నో చెప్పేసేవారు. తర్వాత మళ్లీ కుర్ర హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తాయో.. లేదో.. ఫేడౌట్ హీరోయిన్గా మారిపోతామేమో అనే భయం వాళ్ళలో కనిపించేది. ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఎంత పెద్ద స్టార్ బ్యూటీ అయిన సీనియర్ హీరోల సినిమాలకైనా నో చెప్పేసేవారు.
ఇప్పుడు హీరోయిన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలకు సీనియర్, జూనియర్ అని తేడా చూడడం లేదు కథల పరంగా చూస్తున్ఆరు. సీనియర్ హీరోలతో అయినా జత కట్టడానికి ముద్దుగుమ్మలు సిద్ధమవుతున్నారు. అలాంటి కాంబినేషన్స్ చాలానే మొదలయ్యాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ సీనియర్ హీరోలతో జటకట్టేందుకు కన్నడ భామలు ముందుంటున్నారు. అలా.. గతంలో నాగార్జునతో యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్.. నా సామి రంగ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత మళ్లీ సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు మెరిసిన సందర్భాలే రాలేదు. ఏదో రేర్ గా మాత్రమే ఇలాంటివి జరుగుతాయని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు ఆ సీనియర్ బ్యాడ్ సెంటిమెంటును యంగ్ హీరోయిన్‌లు బ్రేక్ చేస్తు.. అఖండ 2 లో సంయుక్త.. వెంకటేష్ తో శ్రీనిధి శెట్టి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


