ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్.. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూ.875 కోట్ల కలెక్షన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే రిలీజ్ కు ముందే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేరు. సినిమా రిలీజై ఆడియన్స్‌లో తెచ్చుకున్న టాక్‌ బట్టి కలెక్షన్లు, కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సక్సెస్ కావాలంటే బడ్జెట్ తో కాదు.. కంటెంట్తో ఆడియన్స్ హార్ట్‌ను ఆట‌చ్ చేయాలి. కథలో వాళ్లను కూడా భాగం చేసేలా డిజైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ చిన్న సినిమా నిరూపించింది.

Secret Superstar - Official Trailer | Zaira Wasim | Aamir Khan | Superhit  Hindi Movie

కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సినిమా ఏకంగా రూ.875 కోట్ల కలెక్షన్లకు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. ఏ స్టార్ కాస్టింగ్ లేకుండా ఓ హీరోయిన్‌తో ఈ సినిమా.. కేవలం కథ ఆడియన్స్‌కు కనెక్ట్ చేసింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ బ్లాక్ బస్టర్ మూవీ మరేదో కాదు సీక్రెట్ సూపర్‌స్టార్స్‌. ఇందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరు. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో జైరా వసిం హీరోయిన్గా నటించింది. సింగర్ కావాలనుకునే టీనేజర్ కలలను సాధించే కథ‌తో సినిమా తెర‌కెక్కింది.

Secret Superstar - Wikipedia

ఈ మూవీలో జైరావసిం తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక సింగర్ కావాలనే కలతో ఓ టీనేజర్ ఫేస్ రివిల్ చేయకుండా.. సోషల్ మీడియాను ఉపయోగించుకొని సింగింగ్ వీడియోలను అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది. అలా.. క్రమక్రమంగా స‌క్స‌స్ తో సంచ‌ల‌నం సృష్టించింది. అమీర్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో వేశారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.876 కోట్లు కొల్లగొట్టగా.. కేవలం భారత్ లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాదు.. విమర్శకులతో ప్రశంసలు సైతం అందుకుంది.