తప్పు చేసింది వాళ్లు.. దొరికింది మనం.. వార్ 2 రిజల్ట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో అత్యంత బిగ్గెస్ట్ రిస్కీ టాస్క్ ప్లే చేసేది ఎవరు అంటే టక్కున నిర్మాతల పేర్లు చెప్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సినిమాల సైతం కోట్లు కొల్లగొడితే.. మరి కొన్నిసార్లు వందల కోట్లు భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి భారీ నష్టాలను తెచ్చిపెడతాయి. ఇక.. డిస్ట్రిబ్యూటర్లకు లాభనష్టాలు ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో మాత్రం సినిమా అస్సలు అంచనాలను టచ్ కూడా చేయలేక భారీ మొత్తంలో నష్టాన్ని డిస్ట్రిబ్యూటర్లకు మిగులుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ విషయంలోనూ అదే జరుగుతుంది. ఇటీవల.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో సినిమాకు నాగవంశీ డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Producer Naga Vamsi Reacts On Jr NTR War 2 Result | TFPC - YouTube

మొదటి నుంచి తార‌క్‌పై వంశీకి ప్ర‌క్యేక‌ అభిమానం. ఈ క్రమంలోనే గతంలో దేవర సినిమాను డిస్ట్రిబ్యూటర్ గా మారి భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు. అదే అభిమానంతో చివరిగా ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా తెలుగు హక్కులను సైతం భారీ కాస్ట్ కు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేస్తుంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని.. పెట్టుకున్న అంచనాలన్నీ రివర్స్ అయ్యాయి. మిక్స్డ్ టాక్ కారణంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ రిజల్ట్ అందుకుంది. ఈ క్రమంలోను.. నాగ వంశీ పలు నెగటివ్ కామెంట్లను, ట్రోల్స్ ని సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి ప్రధాన కారణం వార్ 2 సినిమా ఈవెంట్‌లో నాగవంశీ ఓ బలమైన సవాలు విసిరడం. సినిమా చూసి సంతృప్తి చెందకపోతే మళ్లీ మైక్ పట్టుకుని మిమ్మల్ని సినిమా చూడమని మాత్రం అడగను అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేమ‌డం.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన చేసిన కామెంట్స్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అయినా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తాజాగా.. మాస్ జాతర సినిమా ప్రమోషన్స్‌లో రవితేజతో చేసిన ఇంటర్వ్యూలో నాగ వంశీ ఈ కామెంట్లపై రియాక్ట్ అయ్యారు తప్పులు అందరూ చేస్తారు కదా.. తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటూ తన వాద‌న మొదలుపెట్టాడు. నేనైనా, ఎన్టీఆర్ గారైనా, ఆదిత్య చోప్రా అనే పెద్దమనిషిని.. య‌ష్‌ రాజ్ ఫీలింగ్స్ వాళ్ళని నమ్మ‌ము. తప్పు వాళ్ళు చేస్తే.. మ‌నం దొరికాం.. దానికి నన్ను ఇప్పటికే వేసుకున్నారు కదా (ట్రోల్స్‌ చేశారు) అంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు.

Producer Naga Vamsi Reacts On Jr NTR War 2 Result | TFPC - YouTube

ఈ ఫెయిల్యూర్ బాధ్యత మాది కాదని.. ఒరిజినల్ మేకర్స్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ అని.. ఆయన ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. మేము కేవలం ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ని నమ్మి సినిమాను కొన్నాం.. కంటెంట్ విషయంలో మా ప్రమేయం లేదంటూ చెప్పుకొచ్చాడు. మనం తీసిన సినిమా కాకుండా.. బయట సినిమాతో దొరికిపోయాం.. హ్యాపీ అంటూ ఆయన సరదాగా కామెంట్ చేశాడు. డిస్ట్రిబ్యూటర్లుగా రిస్క్ తీసుకున్నాం కానీ.. కంటెంట్ ఫెయిల్యూర్ కు మేము కారణం కాదంటూ మొత్తం మీద నాగ వంశీ వార్ 2 రిజల్ట్ పై తన స్టాండ్ ను క్లియర్ గా చెప్పడంతో ప్రస్తుతం ఈ కామెంట్లు వైర‌ల్‌గా మారుతున్నాయి.