టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్ మారు మోగిపోతుంది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలు పాత సినిమా టైటిల్స్ మొత్తం.. తమ సినిమాలకు వాడేస్తున్నారు. తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాంటి సినిమాలు ఇటీవల కాలంలో తెరకెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమా టైటిల్సే కాదు.. పాటల లిరిక్స్ కూడా వాడేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా గుండెజారి గల్లంతయింది, కెవ్వు కేక, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలు వచ్చి మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.
ఈ క్రమంలోనే సినిమా సాంగ్స్, సినిమాల పేర్లు కాదు.. ఆయన సినిమాలోని డైలాగులు కూడా టైటిల్ గా వాడేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత ఏడాది పవన్ కాకినాడ పోర్ట్‌కు వెళ్లి అక్రమంగా రవాణా అవుతున్న పిడిపి రైస్‌ను సీజ్ చేసి.. సీజ్ ది షిప్ అంటూ చెప్పిన డైలాగ్ ఎంత సంచలన సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అదే పదం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. సీజ్ ది షిప్ అనే టైటిల్ ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకోవడం విశేషం. త్వరలోనే టైటిల్ పై సినిమా తెరకెక్కనుంది. అంతేకాదు.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కి బ్లాక్ బస్టర్ అందుకున్న ఓజీ సినిమాలోని ఓ క్రేజీ డైలాగ్‌ని కూడా సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.
ఇంతకీ ఆ డైలాగ్ ఏదో కాదు.. ” బగుల్ బువా”. ఎస్.. ఓజీ సినిమాల్లో ఈ డైలాగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు అదే పేరును ఫిలిం ఛాంబర్‌లో ఓ టైటిల్ కోసం రిజిస్టర్ చేశారట. దీనికి పర్యాయపదాలు రాక్షసుడు, సైతాన్ లాంటి పదాలు వస్తాయి. చిన్నపిల్లలు మారం చేస్తుంటే అన్నం తినకపోతే బూచోడు వస్తాడని తల్లులు చెబుతూ ఉంటారు. ఇక.. ఆ బూచోడే ఈ బగుల్ బువా ఎక్కువగా ఈ పదాన్ని సైతాన్ అని కూడా సంబోదిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ సినిమాల్లో ఎలాంటి టైటిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాంటిది మొట్టమొదటిసారి తెలుగులోనూ ఇలాంటి పదంతో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఓజీ మంచి యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నప్పుడు ఈ డైలాగ్ రావడంతో ఇది మరింత క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్‌లో టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంతకీ సినిమాను ఎవరు చేయబోతున్నారు.. హీరో, హీరోయిన్లు ఎవరు..? అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.



