” ఫౌజి ” మూవీ ప్రభాస్ చిన్నప్పటి రోల్ కోసం ఆ క్రేజీ హీరో కొడుకు.. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నాడు. ఇక ప్రెజెంట్ రాజా సాబ్ సినిమాతో పాటు.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమా సెట్స్ లోను సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫౌజి టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది.

ఫౌజీ'లో జూనియర్‌ ప్రభాస్‌గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ | Actor Sudheer Babu  Son Darshan Got Chance In Fauji Movie | Sakshi

ఇక తాజా సమాచారం ప్రకారం ఫౌజీ సినిమాలో స్టార్ హీరో కొడుకు ప్రభాస్ చిన్నప్పటి రోల్‌లో మెరవనున్నాడు అంటూ టాక్ మరింత వైరల్ గా మారుతుంది. ఇంతకీ.. అతను ఎవరో కాదు.. సిక్స్ ప్యాక్ బాడీ, యాక్టింగ్ టాలెంట్‌తో యూత్ లో తనకంటూ ఒక క్రేజ్‌ను సంపాదించుకున్న సుదీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ అట. మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే ద‌ర్శ‌న్ గూఢాచారి సినిమాలో చిన్న రోల్లో మెరిసిన దర్శన్‌.. ఇప్పుడు ఫౌజీలో ప్రభాస్ చిన్నప్పటి పాత్ర కోసం సెలెక్ట్ అయ్యాడు అంటూ తెలుస్తుంది.

అయితే.. దీనిపై అటు ఫౌజీ టీం కానీ.. ఇటు సుదీర్ బాబు కానీ అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. ఇక ప్రభాస్ ఫౌజి సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయ‌న్సర్ ఇమన్వీ ఈస్మైల్ ఈ సినిమాలో హీరోయిన్ గా మెరవ‌నుంది. ఇక సినిమాలో నిజంగానే సుధీర్ బాబు కొడుకు ప్రభాస్ చిన్నప్ప‌టి పాత్రలో నటిస్తే మాత్రం ఆడియన్స్ లో మంచి హైప్ నెల‌కొంటుంది.