నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్లో థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే చార్జ్ బస్టర్‌గా ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. సినిమా రీ – రికార్డింగ్ విషయంలో విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. మరి ఇప్పుడు.. వీళ్ళ కాంబినేషన్లో రానున్న అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్ లో అదే రేంజ్ లో హైప్ మొదలైంది.

అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక.. సినిమా మ్యూజిక్ కోసం థమన్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను మొదలుపెట్టాడు. ఇద్దరు శ్లోక పట్టనంలో ఆరితేరిన వైదిక బ్రాహ్మణుల చేత.. కొన్ని శ్లోకాలు పాడించిన ఆడియో గతంలో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కేవలం ఆడియోతోనే ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన థమన్.. ఇప్పుడు మరో సాంగ్ కోసం క్లాసికల్ టచ్ ఇచ్చేందుకు సర్వేపల్లి సిస్టర్స్ ను రంగంలోకి దించాడు.
వీళ్లిద్దరు చెన్నైలో సెటిల్ అయినా నెల్లూరుకు చెందిన తెలుగు కుటుంబం వ్యక్తులు. కర్ణాటక మ్యూజిక్ లో టచ్ ఉన్న వీళ్ళిద్దరూ.. డాక్టర్లుగా బిజీగా ఉన్నా.. మ్యూజిక్ పై ఉన్న ఇష్టంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సాంగ్స్ పాడుతూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. అవి నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక వీళ్లిద్దరు చేత అఖండ 2 సినిమాలో ఒక క్లాసికల్ సాంగ్ పాడించనున్నారని అఫీషియల్‌గా థమన్ వెల్లడించాడు. ఈ మేరకు వాళ్ళిద్దరితో కలిసి ఉన్న ఫోటోస్‌ను షేర్ చేశాడు. ఇక.. థమన్ చివరిగా చేసిన ఓజీ.. మ్యూజిక్ సెన్సేషన్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ 2 తాండవం కోసం.. అంతకు మించిపోయే స్ట్రాంగ్ ప్లానింగ్ లో ఉన్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.


