సుకుమార్ – చరణ్ మూవీ బిగ్ అప్డేట్.. మొదలయ్యేది అప్పుడే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్‌బ‌స్టర్ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్‌ సినిమాల సాలిడ్ స‌క్స‌స్‌ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ఇది.

RC17: Sukumar's Never Before Genre with Charan?

ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌ ఆడియన్స్‌లో ఈ సినిమాపై భారీ హైప్ మొద‌లైంది. ఇక సుకుమార్.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోని స్క్రిప్ట్ పనులు తుది ద‌శ‌కు చేరుకున్నాయని టాక్. ఇక.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ దుబాయ్ లో ఉంటూనే సుకుమార్ చక్క పెట్టేస్తున్నాడు. దాదాపు అన్ని పనులు కంప్లీట్ అయ్యాయని.. సినిమాకు కంటెంట్ సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

rc17 version 2 . . #globalstarramcharan #ramcharan #sukumar

ఇలాంటి క్రమంలో.. ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అదే సినిమా రెగ్యుల‌ర్ షూట్.. వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఈ మూవీ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తుంది. ఇక‌రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించరున్నారు. ఇక.. ఈ సినిమా 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో చరణ్ ఎలాంటి హైన్‌ క్రియేట్ చేస్తాడో.. ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.