టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ప్రశాంత్ వర్మ పేరు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. డివీవీ ఎంటర్టైన్మెంట్స్‌ను ప్రశాంత్ వర్మ మోసం చేశాడంటూ.. కొన్ని గంటలుగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. డీవీవీ సంస్థ నుంచి భారీ మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకున్న ప్రశాంత్ వర్మ.. ఆ ప్రాజెక్టును ఫైనల్ చేయకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడంటూ టాక్ ఒక్కసారిగా భారీ లెవెల్లో స్ప్రెడ్ అయింది. ఈ క్రమంలోనే సినీ వర్గాలతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం దీనిలో వాస్తవం ఎంతో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆర్‌ఆర్ఆర్, ఓజీ లాంటి బడా ప్రాజెక్టులు ఇచ్చి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న డివీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్లాన్ చేసి పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయడమే కాదు.. అత్యున్నత ప్రమాణాలతో సంస్థలో ప్రశాంత్ వర్మ వివాదాల టాక్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. ఈ రూమర్లతో పరిస్థితి మరింత హీట్ ఎక్కడంతో.. ఫ్యాన్స్, మీడియా వర్గాలు, ట్రేడ్ సర్కిల్స్ అన్ని డివీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా.. లేదా.. అని ఎదురుచూశారు. ఎట్టకేలకు డివీవీ బ్యానర్ తరపు నుంచి ఓ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ రూమర్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ.. నోట్‌లో క్లియర్ గా మ్యాటర్ ను వెల్లడించారు. మా సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలను జరపలేదు.. ఆయనకు ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదు.. అలాగే మాతో ఏ సినిమా ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి.. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దు.. ఎవరు నమ్మవద్దు.. అంటూ అ నోట్లో పేర్కొన్నారు. ఈ అఫీషియల్ క్లారిటీతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్నింటికి చెక్ పడింది.

