RC 17: సుకుమార్ కండిషన్స్ కి చరణ్ ఫైర్..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్ లో అంతకంతకు ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆయన తెర‌కెక్కించే కంటెంట్ ఏదైనా సరే.. ప్రేక్షకులు అర్థం చేసుకునేలా డిజైన్ చేస్తూ.. ఒక సినిమాను మించి మరో సినిమాతో సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రతి సినిమాలోను ఒక మెసేజ్ తో పాటు.. మైనర్‌ డీటెయిలింగ్‌ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అందుకే.. సుకుమార్ చేసిన ప్రతి సినిమా, అందులో ప్రతి సీన్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే.. చివరిగా పుష్ప ఫ్రాంఛైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సుక్కు.. మరోసారి రామ్‌చరణ్‌తో సినిమాకు సిద్ధమయ్యాడు.

గతంలో.. వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి.. వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం సుకుమార్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. చరణ్‌తో చేయబోయే సినిమా విషయంలోను చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడట. అందులో భాగంగానే.. చరణ్‌కు సుక్కు చాలా కండిషన్స్ పెట్టాడని తెలుస్తోంది. అందులో బాడీ వెయిట్ తగ్గడం ఒకటి. అయితే.. చరణ్, సుకుమార్ కండిషన్‌కు కాస్త వెనకడుగు వేసాడట. ఇప్పుడు బరువు తగ్గడం అంటే జిమ్ మానేయాలి.

Pushpa 2 director Sukumar reviews Ram Charan's Game Changer: 'He will get a  National Award for the performance' | Take One

నావల్ల కాదంటూ ఫ‌నీగా చెప్పుకొచ్చాడట. అయితే.. సుకుమార్ రియాక్ట్ అవుతూ రంగస్థలంలో నిన్ను చూపించిన రేంజ్‌కు మించిపోయే క్యారెక్టర్ లో ఇప్పుడు చూపించబోతున్నా. కచ్చితంగా నువ్వు దానికి తగ్గట్టుగా ఉండాలంటే.. నేను చెప్పినట్లు చేయాల్సిందేనంటూ కరాకండిగా చెప్పేశాడట సుక్కుమార్. రామ్ చ‌ర‌ణ్‌తో మరి అంతా గట్టిగా మాట్లాడంతో చరణ్.. సుక్కు పై ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఏదేమైనా.. సినిమా కోసం సుకుమార్ చెప్పినట్లు రామ్ చరణ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇదే కాకుండా.. సినిమా విషయంలో సుక్కు పెడుతున్న కండిషన్స్ విషయంలో.. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తుతున్నాయని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక స్క్రిప్ట్ విషయంలో మాత్రం అటు చరణ్.. ఇటు సుక్కు కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి.. ఈ సినిమాతో రంగస్థలం మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.