మహేష్ కు మాటిచ్చిన రాజమౌళి.. బాహుబలి కంటే ముందే..!

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటూ ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు రిలీజై.. పాన్ ఇండియన్ సక్సెస్ దక్కించుకున్న తర్వాత.. ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకు.. ఎంతో మంది స్టార్లు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. తన సినిమాలకు హీరోలను ఎంచుకునే ఛాయిస్ రాజమౌళికి వచ్చింది. ఏ హీరోతో సినిమా చేయాలని జక్కన్న ఫిక్స్ అయితే.. అదే ఫైనల్ డెసిషన్ అయిపోతుంది. ఇలాంటి క్రమంలో.. ఆయన తన సినిమా కోసం ఎంచుకున్న ఆప్షన్ మహేష్ మాత్రమే కావడం విశేషం.

SS Rajamouli unveils first look of Mahesh Babu-Prithviraj's film. Who is  Globetrotter?

ఇక ప్రస్తుతం మహేష్ తో రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా.. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా గ్లోబల్ లెవెల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి సక్సెస్ అందుకుంటుంద‌ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రో ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఏంటంటే రాజమౌళి, మహేష్‌ను హీరోగా ఇప్పుడు కాదు.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ కంటే ముందే ఫిక్స్ అయ్యాడట. మహేష్‌ను కలిసిన రాజమౌళి.. మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని.. అప్పట్లోనే అడిగాడు. తప్పకుండా అని మహేష్ ఒప్పుకున్నాడ‌ని టాక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే మహేష్ కంటే ముందు ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ లతో సినిమాలు తీయాలని ఫిక్స్ అయిన రాజమౌళి.. మహేష్ తో కచ్చితంగా సినిమా తీస్తానని ప్రామిస్ చేశాడట.

SSMB29: Mahesh Babu starrer to release as a single movie, SS Rajamouli to  break two part movie tradition

అనుకున్నట్లుగానే బాహుబలి తో మొదటి పాన్ ఇండియన్ సినిమానే తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్, చరణ్‌లతో ఆర్‌ఆర్ఆర్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక.. ఇప్పుడే మహేష్‌తో సినిమా తీసేందుకు సరైన టైమ్ అని భావించిన జక్కన్న.. ఎట్టకేలకు ప్రణాళిక సిద్ధం చేసి మహేష్ ను రంగంలోకి దింపాడు. అయితే.. ప్లానింగ్ కేవలం రాజమౌళిది కాదట. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్రధారి అంటూ తెలుస్తుంది. రాజమౌళికి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇంత ఇమేజ్ వచ్చిందంటే.. దానికి ప్రధాన కారణం విజయేంద్రప్రసాద్ రాసిచ్చిన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఏ టైం లో ఏ సినిమానో తెర‌కెక్కించాలని బ్యాక్ అండ్ సలహాలతోనే.. రాజమౌళి ముందుకు కొనసాగుతున్నాడని ఎంత గొప్ప డైరెక్టర్ గా మారగలిగాడంటూ తెలుస్తుంది.