రెబల్ స్టార్ ప్రభాస్.. ది రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీబిజీగా గడుతున్నాడు. ఈ సినిమా తుది దశకు చేరుకుంది. 90% కంప్లీట్ చేసిన ఈ మూవీ.. సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సాంగ్స్ షూట్ రీసెంట్ గానే మొదలుపెట్టారు మేకర్స్. ఈ సాంగ్స్ కు సంబంధించిన చాలా ఫోటోలే సోషల్ మీడియాలో లీక్ అయ్యి.. తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఈ ఫొటోస్‌లో ప్రభాస్ లుక్ ఊర మాస్‌గా కనిపించడం.. అభిమానులకు మరింత ఆసక్తిని పెంచేస్తుంది. మిర్చి, బుజ్జిగాడు టైంలో చూసిన వింటేజ్ ప్రభాస్ మరోసారి ఈ సినిమాలో చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాదరణ ఆడియన్స్‌లోను సినిమాపై మంచి హైప్ మొదలైంది.
ఇక.. సినిమా నుంచి ఎప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. సినిమా ఆలస్యానికి గల అసలు కారణాన్ని తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. మా సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. ఒక్కరి కారణంగా ఈ సినిమా అంతా ఆలస్యమైంది. ఆ వివాదమే సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ.. ఆ వ్యక్తి మరెవరో కాదు విఎఫ్‌ఎక్స్ మేనేజర్ అట.
అతను సరిగ్గా పని చేయలేదని.. నాసిరకమైన విఎఫ్ఎక్స్ షాట్స్ అందించాటని.. అవి డైరెక్టర్‌కు అస్సలు నచ్చకపోవడంతో.. అడిగితే తిరిగి డైరెక్టర్ నే బెదిరిస్తూ మాట్లాడుతున్నాడని.. విశ్వప్రసాద్ వివరించారు. దీంతో మేము విఎఫ్ఎక్స్ మేనేజర్ ని మార్చేయాల్సి వచ్చింది. అందుకే ఏప్రిల్ లో రావలసిన సినిమా వాయిదా పడి సంక్రాంతి బరిలో దిగుతుంది అంటూ వివరించాడు. దీన్నిబట్టి ఏప్రిల్ కి ఇంకా సినిమా విఎఫ్ఎక్స్ పనులు అసలు పూర్తే కాలేదని క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌లో విఎఫ్ఎక్స్ విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా డిజైన్ చేస్తున్న క్రమంలో.. ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ వదిలిపోయింది. సినిమా అదిరిపోయే క్వాలిటీతో ఆకట్టుకుంటుందని.. సంక్రాంతికి రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నారు.