టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చైతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరసపెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న సినిమా.. గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక.. ప్రభాస్ ఈ సినిమాతో పాటే హనురాగపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఫౌజీ రన్నింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. అయితే.. సినిమా టైటిల్ మాత్రం ఇప్పటివరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు.
ఇలాంటి క్రమంలోనే.. టైటిల్‌ను యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అనుకోకుండా లీక్ చేసేయడం విశేషం. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్యూడ్. అక్టోబర్ 17న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రేమలు బ్యూటీ.. మమితా బైజు.. ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. మైత్రి మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. అలా.. సినిమా ప్రమోషన్స్‌లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ప్రభాస్ హనురాగపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ రివీల్ చేసేయడం అందరికి షాక్ కలిగించింది. డ్యూడ్ సినిమా రిలీజ్ అవుతున్న మైత్రి మేకర్స్ బ్యానర్ పైనే.. హను రాఘవపూడి – ప్రభాస్ కాంబో మూవీ కూడా తెరకెక్కనుంది.
ఈ క్రమంలోనే.. మైత్రి మేకర్స్ అభిరుచి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. నేను ఈ విషయం చెప్పొచ్చా లేదో నాకు తెలియదు కానీ.. ప్రభాస్ సార్ నటిస్తున్న ఫౌజిలోని కొన్ని క్లిప్పింగ్స్ చూశా. ఈ క్లిప్పింగ్స్ చూస్తేనే.. మీ అభిరుచి ఏంటో అర్థం అయిపోతుంది. ఈ రేంజ్‌లో కథల విషయంలో సెలక్షన్ అసాధారణం అంటూ మేకర్స్ ను పొగిడే ప్రాసెస్‌లో సినిమా టైటిల్ లీక్ చేసేసాడు ప్రదీప్. ఈ క్రమంలో తాజాగా ప్రదీప్ రంగనాథర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇన్ని రోజులు రనింగ్ టైటిల్‌గానే అంతా భావించారు. ఇలాంటి క్రమంలో.. ప్రదీప్ అదే టైటిల్ను వర్ణిస్తూ.. సినిమా గురించి చెప్పడంతో కచ్చితంగా టైటిల్ ఇదే అయి ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.