సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆరాటపడుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. కంటెంట్ మెప్పిస్తే ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకోవడం కాయం. అలాంటి.. ఓ క్రేజీ ఎస్ట్ సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్స్ లో ఓకటైన అనిల్ రావిపూడి. పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ రానుందట. తాజాగా పవన్ భోజి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్తో ఆడియోస్ ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ పై ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అయితే.. దర్శకుడు విషయంలో దిల్ రోజు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. తాజాగా పవన్ సినిమా కోసం అనిల్ రావిపూడి ని డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడంటూ సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ఇమేజ్‌ను నిలబెట్టే సబ్జెక్టుతో కథను రూపొందించబోతున్నాడని.. ఆ సబ్జెక్టులో మాస్, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ అన్ని అంశాలను సమపాలలో జోడించి కచ్చితంగా సక్సెస్ కొట్టేలా అనిల్ ఈ స్టోరీని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రజెంట్ అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా.. ఆకట్టుకునేలా.. తీయడంలో టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే పవన్‌తో.. అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. అనీల్ రావిపూడి సినిమాలు దాదాపు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు గా తెరకెక్కుతాయి. పవన్ అభిమానులు సైతం ఎప్పటినుంచో పవన ఫామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ కామెడీలో విజృంభించి చేయగలరు. ఈ క్రమంలోనే పవన్, అనిల్ రావిపూడి కాంబో తెరకెక్కితే మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో అనిల్ ప్రజెంట్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా షూట్ కంప్లీట్ అయిన తర్వాత పవన్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతాడని సమాచారం.