మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్‌కు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అందరి మనసులు దోచేసిన యంగ్ హీరో తర్వాత తెరకెక్కిన ఈ సినిమాతోను సక్సెస్ అందుకున్నాడు. మరోసారి హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. ఆయన నటించిన చివరి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇక.. త్వరలో నార్నీ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ యంగ్ హీరోకు శివాని అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. గత ఏడాది నవంబర్ 3న జరిగిన నితిన్, శివనీల ఎంగేజ్మెంట్ వేడుకలలో ఎన్టీఆర్‌తో పాటు.. వెంకటేష్ ఫ్యామిలీ సభ్యుల సైతం సందడి చేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎంగేజ్మెంట్‌కు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే.. ఎంగేజ్మెంట్ జరిగి ఏడాది అయిపోతున్న టైంలో.. తాజాగా మ్యారేజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 10న వీళ్లిద్దరూ ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది.
ముహూర్తం దగ్గర పడుతున్న క్రమంలో.. పెళ్లి పనులు కూడా ఊపందుకున్నాయట. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కూడా ఈ పెళ్లి పనుల్లోనే బిజీ అయిపోయినట్లు సమాచారం. ఇక శివాని బ్యాగ్రౌండ్ ఏంటో చాలామందికి తెలియదు. ఆమె నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె. నెల్లూరులో వీళ్ళ కుటుంబానికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నట్లు సమాచారం. అలాగే.. టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి కూడా శివాని.. చాలా దగ్గర బంధువవుతుందట.ఇక ఈ మ్యారేజ్ డేట్ ప్రజెంట్ తెగ వైరల్ గా మారుతుంది.