మెగా డాటర్ నిహారికకు టాలీవుడ్ ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా, హీరోయిన్ గా ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. అయితే.. తాజాగా ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి.. ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. ప్రొడ్యూసర్‌గా తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు.. ఈ ముద్దుగుమ్మ రెండో సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీబిజీగా గడుతుంది. సంగీత్ శోభన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది ఇలాంటి క్రమంలోనూ అమ్మడి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ అందరితో పంచుకుంటుంది.
అయితే.. తాజాగా నిహారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది. నేడు మెగా హీరో సాయి ధరంతేజ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. అతనికి విషెస్ తెలియజేసింది. హ్యాపీ బర్త్డే బావ లవ్ యు అంటూ రెడ్ హాట్ సింబల్ ను పంచుకుంది. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారడంతో దానిపై అంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే.. గతంలో నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలానికే వీళ్లలిద్దరు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వెకేషన్స్, ట్రిప్స్ అంటూ చాలా కాలం పాటు జనానికి దూరంగా ఉన్న నిహారిక.. తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టింది.
ఓ పక్క నిర్మాతగా మారి సినిమాలు చేస్తూనే.. మరోపక్క హీరోయిన్ గాను పలు సినిమాలో నటిస్తుంది. ఇలాంటి క్రమంలో సాయి ధరమ్ తేజ్‌కు లవ్ యు బావ అంటూ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేయడంతో ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. సాయి ధరం తేజ్ సైతం.. నిహారికకు ఎప్పుడు గ్రాండ్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనూ తనపై ఏదైనా నెగటివ్ వస్తే చాలు స్ట్రాంగ్ గా వాళ్లకు కౌంటర్ ఇస్తాడు. ఈ క్రమంలోని నిహారిక.. సాయి ధరంతేజ్ ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. మీ బావను సెట్ చేసేసుకో నిహారిక అంటూ రకరకాలుగా అభిప్రాయాలన్ని వ్యక్తం చేస్తున్నారు.