సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయన్ సినిమాలతో పాటు.. కాంట్రవర్సీలతోను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతునే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విషయాలతో వివాదాల్లో చిక్కుకున్న ఈ అమ్మడు.. కెరీర్‌లో హాట్ టాపిక్స్‌గా మారిన టాప్ 10 కాంట్రవర్సీల లిస్ట్ ఒకసారి చూద్దాం.
ధనుష్ తో నయనతార కాంట్రవర్సీ
నయన్‌కు తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌తో వివాదం అయ్యింది. ఈ విషయంలో వారు కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2024 లో నయనతార తన పెళ్లి వీడియోను.. నయనతార బియాండ్ ఫెయిరీ టైల్స్ అనే డాక్యుమెంటరీ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసింది. అయితే.. ఇందులో నయన్ హీరోయిన్గా నటించిన నానుం రౌడీ దానన్ (2015) సినిమాలోని కొన్ని సీన్స్ నయనతార తన స్టోరీ కోసం వాడుకుంది. ఈ సినిమా నిర్మాత.. స్టార్ హీరో ధనుష్‌ను ఈ విషయంలో పర్మిషన్ అడిగిన.. తను ఒప్పుకోలేదట. అయినా సరే సీన్స్ వాడుకోవడంతో తను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. నయనతార టీంకు లీగల్ నోటీసులు కూడా అందించాడు. ఈ క్రమంలోనే ధనుష్ పై నయనతార సోషల్ మీడియా వేధికగా ఓపెన్ కామెంట్ చేస్తూ ఫైర్ అయింది. విమర్శలు కురిపించింది. తన అనుమతి లేకుండా సినిమాలో సీన్స్ వాడుకున్నందుకు.. రూ.10 కోట్లు పరిహారం డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ధనుష్ దాఖలు చేసిన ఈ కేసులో.. నయనతార ఇప్పటికీ కోర్టులో నలుగుతూనే ఉంది.
చంద్రముఖి ప్రొడ్యూసర్స్:
ఇక నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ విషయంలోనే మరో కేసును ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వాడుకున్నారని.. ఆ మూవీ నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కారు. రీసెంట్గా ఈ విషయంలో కూడా.. నయనతారకు నోటీసులందాయి. వారు కూడా భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి ప్రాంగణంలో చెప్పులు వేసుకున్న వివాదం:
నయన్, విఘ్నేష్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న క్రమంలో.. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం జంటగా తిరుపతి వెళ్లారు. అయితే.. నయనతార, విఘ్నేష్ గుడి దగ్గర చెప్పులతో ఫోటోలు దిగడం పెద్ద దుమారమే రేపింది. ఈ క్రమంలోనే తిరుమల దేవస్థానం వాళ్ళు నయన్, విఘ్నేష్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ జంట టీటీడీ దేవస్థానానికి క్షమాపణలు తెలుపుతూ.. లేఖ రాసి అందించారు.
సరోగసి కాంట్రవర్సీ:
నయన్ తన కెరీర్లో రెండు సార్లు బ్రేకప్ తర్వాత డైరెక్టర్ విఘ్నేష్‌ను వివాహం చేసుకుంది. అయితే.. పెళ్లి జరిగిన కొన్ని నెలల్లోనే వీళ్ళు సరోగసి తో కవల పిల్లలకు జన్మనిచ్చారని.. కవల పిల్లలు జన్మించడం ఓ హాట్ టాపిక్ గా మారింది. సరోగసి.. చట్టాలను ఉల్లంఘించి పిల్లలు కన్నారని.. ఆరోపణలు వైరల్ అవడంతో.. తెలంగాణ ఆరోగ్యశాఖ విచారణ జరిపి.. చట్ట వ్యతిరేక ఉల్లంఘనలేవి జరగలేదని క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ వర్సెస్ నయన్:
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌తో కూడా నయనతారకు చిన్న వివాదం రేగింది. ఈ విషయంలో బన్నీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ.. నయనతార, అల్లు అర్జున్‌ను ఆమనించినట్లు అభిమానులు ఫీలయ్యారు. గతంలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2016లో అవార్డు వేడుకల్లో.. నయనతార అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవాల్సి ఉండగా.. అప్పటి తన ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ చేతుల మీదుగా అవార్డును తీసుకోవాలని అనుకుంటున్నా అంటూ స్టేజిపై బన్నీని కోరింది. దానికి అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్ చేయకుండా సీరియస్గా నిలబడిపోయారు. అయితే బన్నీకు ఇష్టం లేకుండానే ఇదంతా జరిగిందని.. నయనతార కావాలనే అల్లు అర్జున్‌ను వమానించడానికి ఇలాంటి పనులు చేసిందంటూ సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టారు ఫ్యాన్స్.
త్రిష , నయన్ వార్
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నయనతారకు గట్టి పోటీ ఇస్తూ.. త్రిష హీరోయిన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన ఎప్పుడు.. ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటూనే ఉంటుంది. అలా.. గతంలోను వీళ్లకు ఓ సినిమా విషయంలో గొడవలు జరిగాయట. కాంట్రవర్సీపై ఇప్పటివరకు ఇద్దరు రియాక్ట్ కాలేదు. ఇక ప్రజెంట్ త్రిష, నయన్ ఇద్దరు హీరోయిన్‌లుగా చిరంజీవితో రెండు సినిమాలలో చేస్తున్నారు.
మీన – నయనతార కాంట్రవర్సీ:
ప్రస్తుతం నయన్ లైనప్ లో ముక్కుతి అమ్మన్ 2 సినిమా కూడా ఒకటి. కుష్బూ భర్త సుందర్ డైరెక్షన్లో ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా విషయంలోనే సుందర్‌తో.. నయనతారకు విభేదాలు ఏర్పడ్డాయని టాక్. అయితే.. దీన్ని కుష్బూ ఖండించింది. అలాంటివేమీ లేవని క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇదే సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ లో నయన్.. కోస్టార్ అయిన మరో సీనియర్ బ్యూటీ మీనా ను అవమానించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. మీనా పక్కనే నుంచున్నా కనీసం ఆమెతో మాట్లాడలేదు సరికదా.. పలకరించను కూడా లేదని.. టాక్ నడిచింది. మీనా ఇదే విషయంపై పరోక్షంగా రియాక్ట్ అవుతూ.. సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సీత పాత్రలో నయనతార:
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీత పాత్రలో నయన్ నటనపై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలకు కారణమైన ఈమె.. పవిత్రమైన పాత్రకు సరిపోదని హిందూ మక్కలు కచ్చి సంస్థ మండిపడింది. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు.. అన్నపూర్ణి ద గాడెస్ ఆఫ్ ఫుడ్ సినిమాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి మాంసాహారం తినే అమ్మాయి రోల్‌లో నయనతార కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలోనూ.. హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసేలా నయనతార సినిమాలు చేస్తుందని ఆరోపణలను ఎదుర్కొంది. ఇప్పటికి ఈ విషయాల్లో కొన్ని కేసులు రన్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్.. అన్నపూర్ణి సినిమాను కూడా తొలగించింది.
ప్రభుదేవా నయనతార వార్
2009లో ప్రభుదేవా, నయనతార ప్రేమ వ్యవహారం నెటింట తెగ వైరల్ గా మారింది. విల్లు సినిమాతో కలిసి నటించిన ఈ జంట ఆ టైంలోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారట. ఈ క్రమంలోనే 2010లో ప్రభుదేవా సైతం వాళ్ళ బంధం గురించి ఓపెన్ కామెంట్ చేశాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమని వివరించాడు. ఇక అప్పటికే ప్రభుదేవాకు పెళ్ళై.. పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత నయనతారను సినిమాలు వదిలేయాలని ప్రభుదేవా పెట్టిన కండిషన్ కారణంగానే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని.. పెళ్లి వరకు వెళ్లకుండానే ప్రేమ బ్రేకప్ అయిపోయిందని టాక్.
సింబు నయన్ లవ్ , బ్రేకప్:
నయనతార తన కెరీర్ ప్రారంభంలోనే అతిపెద్ద వివాదాన్ని ఎదుర్కొంది. అది అప్పటి కోలివుడ్ స్టార్ హీరో సింబుతో ప్రేమాయణం. ఈ విషయంలో అమ్మడి పేరు పెద్ద దుమారంగా మారింది. 2006లో వల్లభ సినిమా షూట్ టైంలో నయనతారతో ప్రేమలో పడ్డాడు సింబు. వీళ్ళిద్దరి ప్రైవేట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారమేరేగింది. తర్వాత కాలంలో వీళ్ళ ప్రేమ బ్రేకప్ అయింది. ఇలా నయన్ లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగే క్రమంలో లెక్కలేనని వివాదాలను ఫేస్ చేసింది.