టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా రిలీజై.. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. భోళా శంకర్ సినిమా తర్వాత ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేయాలని మెగాస్టార్ ఎన్నో ప్లాన్స్ చేసినా.. సినిమాలో నటిస్తూనే ఉన్న ఇప్పటివరకు ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే.. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ కు డబల్ కాదు.. ట్రిపుల్ ఫీస్ట్ ఇచ్చేలా మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ చేశారంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. భోళా శంకర్ తర్వాత.. మెగాస్టార్ విశ్వంభర సినిమా షూట్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను.. గత ఏడాది రిలీజ్ చేయాల్సి ఉండగా.. లేట్ కావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక సినిమా రిలీజ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చిరు.. అనిల్ రావిపూడితో మన శంకర వరప్రసాద్ సినిమా షూట్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ప్రమోషన్స్ సైతం మొదలుపెట్టారు మేకర్స్. ఈ అప్డేట్స్ మెగా అభిమానులను మాత్రమే కాదు.. సినీ లవర్స్ అందర్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక సినిమాలో.. విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ నటించిన మరో మూవీ విశ్వంభర కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా మెరిసింది. కాగా.. ఈ రెండు సినిమాలు తర్వాత బాబి మెగాస్టార్ కాంబోలో మరో సినిమా ఆడియన్స్‌ను పలకరించనుందట. అదే బాబి డైరెక్షన్‌లో చిరు మూవీ. వాల్తేరు వీరయ్య తర్వాత బాలకృష్ణతో డాకు మహారాజ్ తెరకెక్కించి హిట్ కొట్టిన బాబి.. మరోసారి చిరంజీవితో మెగా మాస్ మూవీ ని రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాలతో పాటు.. ఈ సినిమాను కూడా ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట.
ఈ క్రమంలోనే.. బాబీ, చిరు సినిమా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ అవుతుందంటూ టాక్ నడుస్తుంది. వీలైనంత త్వరగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ పనులు ముగించుకొని.. చిరు, బాబీ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నడని సమాచారం. అంతేకాదు.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2026 దసరా.. లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మెగాస్టార్ టీంతో వివరించాడట. సో నెక్స్ట్ ఇయర్ మెగా ఫ్యాన్స్‌కి ఒకటి కాదు.. రెండు కాదు.. ట్రిపుల్ ట్రీట్ రానుంది.

