తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో.. కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో దుమారంగా మారాయో తెలిసిందే. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ.. నా తెలుగు సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయాలంటే అక్కడ డిస్టిబ్యూటర్లు కనీసం స్క్రీన్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే.. కిరాణ్ అబ్బవరం ఆవేదనలో లాజిక్ ఉన్నా.. ఈ సమస్య ఇప్పటిది కాకపోవడంతో సమాధానం ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు.
కాగా ఈ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ చెప్పకపోయినా.. తాను అన్నది త్వరలో రిలీజ్ అయ్యే డ్యూడ్ సినిమా గురించి అని అందరికీ అర్థమైంది. కే ర్యాంన్తో క్లాష్ ఉన్న క్రమంలో.. ఇలాంటి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా డ్యూడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మేకర్స్. ఇందులో భాగంగా.. నిర్మాత మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మంచి కంటెంట్ ఉంటే.. ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వక మానదు. ఒకవేళ తమ డ్యూడ్ కన్నా.. అవతలి సినిమా ఇంకా బాగుంటే కచ్చితంగా మా సినిమా షోస్ ఇవ్వడానికి.. థియేటర్స్ పంచుకోవడానికి మేము సిద్ధం అంటూ రవి శంకర్ వివరించారు.
అంతేకానీ.. నెంబర్ ఆఫ్ థియేటర్ల గురించి మాట్లాడటం సరికాదు అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణతో పోల్చుకుంటే.. తమిళనాడులో థియేటర్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమస్యతోనే సినిమాలకు ఒక్కొక్కసారి థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. అంతేకానీ.. కావాలని చేసింది అయితే కాదు. హిట్లు ఇస్తే ఆటోమేటిక్‌గా షోలు పెరుగుతాయని కుండబద్దలు కొట్టినట్లుగా రియాక్ట్ అయ్యాడు. అలా.. కిరణ్ అబ్బవరం ప్రశ్నకు స్టార్ ప్రొడ్యూసర్ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక రవిశంకర్ అన్నట్లు ఈ దీపావళి విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.