టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. నిన్న ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్ మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రానున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ వీడియో అప్డేట్స్ మేకర్స్ షేర్ చేసుకున్నారు. అలాగే.. హనురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కోసం పాజిటివ్ టైటిల్‌ని కూడా అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా నుంచి కొత్త పోస్టర్ సైతం తెగ వైరల్ గా మారింది. ఇలా.. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంత వరుస అప్డేట్లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ఫౌజికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. అదేంటంటే.. ఇప్పటికి ప్రభాస్.. ఇమన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

కాగా.. సినిమాలో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందని.. ఈ హీరోల కోసమే ఒక కన్నడ బామ్మను రంగంలోకి దించినట్లు టాక్ నడుస్తుంది. ఆమె మరెవరో కాదు.. చైత్ర జే అచ్చర్ నటిగా, సింగర్ గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఫౌజి మూవీలో కీలక పాత్రను పోషించే ఛాన్స్ కొట్టేసిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక చైత్ర విషయానికి వస్తే.. ఇప్పటికే ఇండస్ట్రీలో సింగర్‌గా రాణిస్తూనే.. మరోపక్క నటిగా త్రీబిహెచ్‌కే, సప్తసాగర దాచేయల్లో లాంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. తాజాగా.. ప్రభాస్ ఫౌజి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ టాక్ వైరల్ గా మారడంతో.. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు.. సాదరణ ఆడియన్స్ సైతం అమ్మడు జాక్పాట్ ఆఫర్ కొట్టిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా పీరియడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్.. ఓ పవర్ఫుల్ సోల్జర్ గా కనిపించానన్నట్లు ఇప్పటికే రూమర్లు వైరల్‌గా మారుతున్నాయి. అంతేకాదు.. ఇస్మాయిల్ ఇమన్వీ హీరోయిన్ గా.. బాలీవుడ్ దిగ్గజ నటి అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇక.. ఈ సినిమాను షూట్ వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట టీం. మరి ప్రభాస్ కు ఉన్న బిజి స్కేడ్యూల్‌లో ఈ సినిమా వచ్చే ఏడాదికి కంప్లీట్ చేయగలడా.. లేదా.. సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వేచి చూడాలి.

