టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్ నేడు గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు హైప్ పెంచేందుకు కిరణ్ అబ్బవరం దాదాపు అన్ని విధాలుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అయితే.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కామెడీతో కచ్చితంగా సినిమాలో ఎంటర్టైన్ చేస్తారని ఫీల్ ఆడియన్స్‌కు కలిగింది. ఈ క్రమంలోనే.. చాలావరకు ఆడియన్స్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న కే – ర్యాంప్ ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోస్ ముగించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ మూవీతో అయినా అబ్బవరం హిట్ కొట్టాడా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో చూద్దాం.
కిరణ్ అబ్బవరం కథ సినిమాలతో పోలిస్తే పర్వాలేదు కానీ కమర్షియల్‌గా మాత్రం.. కష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్‌తో టైం పాస్ అనిపించిన అన్ని సన్నివేశాలు రొటీన్ గానే ఉన్నాయని.. ఇక సెకండ్ హాఫ్ అయితే లౌడ్ కామెడీ, క్రింజ్ సన్నివేశాలతో ఆడియన్స్‌కు చిరాకు తెప్పించేలా ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ జనరేషన్ యూత్‌కు కనెక్ట్ అవ్వాలనే టార్గెట్‌తో కొన్ని అడల్ట్ రేటేడ్ డైలాగ్స్ చూపించారని.. అవి చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని.. అందరికీ కనెక్ట్ కావడం కష్టం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం మాత్రం.. తన కామెడీ టైమింగ్ తో, ఎనర్జీతో కచ్చితంగా ఆకట్టుకుంటాడని పెర్ఫార్మన్స్ తో మెప్పించాడని చెప్తున్నారు. ఇక.. సినిమాలో చాలా సన్నివేశాలు నాచురల్ గా కాకుండా ఆడియన్స్‌పై బలవంతంగా రుద్దేలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక.. సినిమాలో కామెడీని మాత్రమే ఎంజాయ్ చేసి.. క్రింజ్‌ను పట్టించుకోకుండా ఉండే ఆడియన్స్.. ఒకసారి సినిమాను చూడొచ్చని.. అసలు క్రింజ్ లేకుండా సినిమా చూడాలంటే మాత్రం.. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ను చూడాల్సి వస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నెగటివ్ టాక్ దక్కించుకున్న కే – ర్యాంప్.. ఫస్ట్ డే ఫస్ట్‌షోతో టాలీవుడ్ ఆడియన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. దీపావళికి సక్సెస్ కొడుతుందా.. లేదా.. చూడాలి.