స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు సైతం దగ్గర అయింది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్వ.. ఓ టాక్ షోలో ఇండస్ట్రీ అనుభవాల గురించి.. రియాల్టీ గురించి చేసిన కామెంట్స్ నిత్యం వైరల్ గా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం కారణంగానే మహిళలు తరచుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారని కామెంట్స్ చేసింది.

జాన్వి కామెంట్స్ అర్ధం.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు మహిళలు ఉంటే.. ఆ ప్లేస్ లో ఓ మహిళ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయగలుగుతుంది. కానీ.. మొత్తం పురుషులే ఉంటే ఆమె తన నిజమైన భావాలను కంప్లీట్గా చెప్పలేదని జాంన్వీ వివరించింది. జాన్వీ చేసిన ఈ కామెంట్స్‌తో ఇండస్ట్రీలో మహిళలకు ఎదురవుతున్న ప్రెషర్, కాంప్రమైజ్‌లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె మాట్లాడుతూ.. మనకు నచ్చని విషయాలు కూడా చేయాల్సి వస్తుంది.. చెప్పలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి.. అంతేకాదు అర్థం కాని కొన్ని విషయాలను కూడా అంగీకరించాల్సి వస్తుందంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇది గ్లోబల్ సినీ ఇండస్ట్రీలోనే చాలా కామన్ ప్రాబ్లంగా చెప్పుకొచ్చింది.

ఇక.. జాన్వీకపూర్ ఎంతో ఓపెన్‌గా చేసినా ఈ కామెంట్స్ యువత మధ్య అహంకారం, లైంగిక వైష్యాలు, స్వతంత్ర పై అవగాహన కలిగించేలా ఉన్నాయి. ఆమె ఇక్కడ అభిప్రాయాలను బయట పెట్టడం వల్ల ఇతర మహిళలకు ధైర్యం మరియు ప్రేరణ కలుగుతుంది. ఇండస్ట్రీలో నిజాలను తేల్చి చెప్పడం.. ఇంత పెద్ద మేడ్ ఆన్ ప్రపంచంలోనే సత్త చాటుకోవడం.. ఆమెకు ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

